సల్మాన్ ఖాన్( Salman khan ) హీరోగా వస్తున్న కిసి కి భాయ్ కిసి కా జాన్ సినిమాలో ఆల్రెడీ విక్టరీ వెంకటేష్ ( Venkatesh )నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో సల్మాన్ వెంకటేష్ ల కాంబో సూపర్ ట్రీట్ ఇవ్వనుంది.
ఇక ఈ సినిమాలో చరణ్ కూడా ఒక కెమియో ఇస్తున్నాడు.నిన్ననే చరణ్ కెమియో సాంగ్ రిలీజ్ చేశారు.
అయితే చరణ్ ఈ సినిమాలో నటించడానికి కారణం గాడ్ ఫాదర్( god father ) లో సల్మాన్ నటించడమే అని అంటున్నారు.చిరు సినిమా కోసం చరణ్ కాల్ చేసి అడిగితే తప్పకుండా చేస్తానని చెప్పిన సల్మాన్ ఖాన్ ఆ సినిమాను సరదాగా చేశారట.
ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా చేశారట.

ఇక ఇప్పుడు చరణ్ ని కూడా తన సినిమాలో కెమియో రోల్ అడగ్గా చరణ్ కూడా తన వంతుగా ఫ్రీగానే చేశాడట.ఏది ఏమైనా మన టాలీవుడ్ స్టార్స్ వెంకటేష్, చరణ్ ఇద్దరు బాలీవుడ్ తెర మీద అక్కడ స్టార్ తో కలిసి స్టెప్పులేస్తుంటే ఆ లెక్కే వేరేలా ఉంటుంది.సల్మాన్ ఖాన్ సినిమాకు చరణ్ వెంకటేష్ ఏ విధంగా హెల్ప్ అవుతారో చూడాలి.
ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.







