'టైగర్ 3' లేటెస్ట్ కలెక్షన్స్.. 200 కోట్ల క్లబ్ లో సల్మాన్ ?

బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ( Salman Khan ) ఒకరు.మరి తాజాగా సల్మాన్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3( Tiger 3 ) .ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబడుతూ దూసుకు పోతుంది.

టైగర్ 3 నిన్న కూడా 18 కోట్లను రాబట్టింది.అయితే వీకెండ్ కంటే ఈ కలెక్షన్స్ తక్కువ.

వీక్ డేస్ లో టైగర్ 3 కలెక్షన్స్ పడిపోయాయి.ఈ వీకెండ్ కూడా బాగానే కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.

Advertisement

ఇక ఈ సినిమా ఇప్పటి వరకు 183 కోట్లను రాబట్టినట్టు తెలుస్తుంది.అతి త్వరలోనే 200 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తుంది.

ఈ సినిమా హిందీలోనే కాదు సౌత్ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది.ఇక్కడ కూడా ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఇప్పటి వరకు 5.25 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టినట్టు సమాచారం.అయితే టైగర్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా తేలిపోయింది అనే చెప్పాలి.

యష్ రాజ్ ఫిలిమ్స్ తన స్పై యూనివర్స్ లో టైగర్ 3 ను చేర్చడంతో బాలీవుడ్ లో భారీ అంచనాలతో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.దీపావళి కానుకగా నవంబర్ 12న రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఈ వీకెండ్ కూడా కలెక్షన్స్ రాబడితేనే 200 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది.కాగా కత్రినా కైఫ్( Katrina Kaif ) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మనీష్ శర్మ తెరకెక్కించాడు.

ఈ సినిమాలో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) క్యామియో రోల్ లో కనిపించాడు.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు