గబ్బర్ సింగ్ తర్వాత చాలా గ్యాప్ తో హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
గబ్బర్ సింగ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మర్చిపోలేని హిట్ ఇచ్చిన డైరక్టర్ హరీష్ శంకర్ చేయబోయే సినిమాతో కూడా అంతకుమించి హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది.
పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారట.
ఈమధ్య సల్మాన్ ఖాన్ తో హరీష్ శంకర్ దిగిన పిక్స్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
అప్పట్లో పవన్ తర్వాత సల్మాన్ తో హరీష్ శంకర్ సినిమా చేస్తాడేమో అని అనుకున్నారు.కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలోనే సల్మాన్ ఖాన్ తో ఒక స్పెషల్ రోల్ వేయిస్తున్నారట.
ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు.ఇప్పుడు పవన్ సినిమాలో కూడా నటిస్తే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది.పవన్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడా లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.







