అనిల్ రావిపూడి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడా.. తేడా వస్తే అంతే పరిస్థితి?

తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట పటాస్ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనిల్ రావిపూడి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు దర్శకుడు తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు.

 Anil Ravipudi Over Confidence On F4 Movie, Anil Ravipudi, F3 Movie, F4 Movie, To-TeluguStop.com

ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.అలా టాలీవుడ్ లో బ్రేకుల్లేని హిట్స్ తో అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి.

ఇకపోతే ఇటీవల ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఇందులో విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్, తమన్నా,మెహ్రీన్ లు నటించిన విషయం తెలిసిందే.ఇక మే 27న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ వీక్ లో అదిరిపోయే కలెక్షన్స్ ను సొంతం చేసుకుని వంద కోట్ల క్లబ్ లోకి చేరింది.

కానీ రెండో వారం మేజర్,విక్రమ్ సినిమాలు బరిలోకి దిగడంతో ఎఫ్ 3 కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది.

కానీ ఇంతలోనే అనిల్ రావిపూడి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుగానే ఎఫ్ 4 సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Telugu Anil Ravipudi, Tollywood-Movie

ఎఫ్ 4 రావడానికి మరో రెండేళ్లయినా పట్టొచ్చని పేర్కొన్న అనిల్ రావిపూడి.హీరోలుగా వెంకీ,వరుణ్ లే కొనసాగుతారని హీరోయిన్లు మారే అవకాశం ఉందని ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు ఈ విషయమే అనిల్ రావిపూడి అభిమానులను కలవర పెడుతోంది.

ఒకవేళ ఈ సినిమా రిజల్ట్ లో ఏదైనా తేడా వస్తే అనిల్ రావిపూడి కెరీర్ డేంజర్ లో పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను నందమూరి బాలకృష్ణతో చేయబోతున్న సంగతి తెలిసిందే.

తండ్రీకూతుళ్ల మధ్య సాగే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో బాలయ్య 45 ఏళ్లు వయసు గల తండ్రి పాత్రలో నటించగా ఆయన కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల అలరించబోతోంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube