ఈమధ్య కాలం లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో పాటుగా ట్రైలర్ రికార్డ్స్ ని( Trailer Records ) కూడా ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.వ్యూస్ కంటే ఎక్కువగా లైక్స్ రికార్డ్స్ మీద ఫోకస్ పెడుతున్నారు ఫ్యాన్స్.
ఎందుకంటే వ్యూస్ కోసం సదరు సినీ నిర్మాతలు యాడ్స్ పెడుతున్నారు కాబట్టి అవి ఎన్ని వచ్చినా లెక్కల్లోకి తీసుకోవడం లేదు.ఆ విధంగా చూసుకుంటే టీజర్, ట్రైలర్ లైక్స్ రికార్డ్స్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లకు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గత చిత్రం ‘భీమ్లా నాయక్’( Bheemla Nayak ) కి సంబంధించిన టీజర్, ట్రైలర్, లిరికల్ వీడియో సాంగ్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పాయి.
భీమ్లా నాయక్ మరియు వకీల్ సాబ్ ట్రైలర్స్ కేవలం 24 గంటల్లో 1 మిలియన్ కి పైగా లైక్స్ ని అందుకున్నాయి.
టాలీవుడ్ లో ఇప్పటి వరకు 24 గంటల్లో అత్యధిక వన్ మిలియన్ లైక్స్ రప్పించుకున్న ట్రైలర్స్ పవన్ కళ్యాణ్ ఖాతాలోనే ఉన్నాయి.ఇక పోతే రీసెంట్ గా విడుదలైన ‘సలార్’( Salaar ) మూవీ ట్రైలర్ లైక్స్ పరంగా 1 మిలియన్ మార్కుని 24 గంటలోపే అందుకుంది కానీ, మొదటి గంట లో ఫాస్టెస్ట్ లైక్స్ ని తీసుకుంటే భీమ్లా నాయక్ రికార్డు ని అందుకోలేకపోయింది.
భీమ్లా నాయక్ ట్రైలర్ కి మొదటి గంటలో దాదాపుగా 8 లక్షల లైక్స్ వచ్చాయి.

ఈ రికార్డు ని ఇప్పటి వరకు ఎవ్వరూ ముట్టుకోలేకపోయారు, సలార్ ట్రైలర్( Salaar Trailer ) కచ్చితంగా ఈ రికార్డు ని బ్రేక్ చేస్తుందని అనుకున్నారు కానీ, ఆ ట్రైలర్ కూడా అందుకోలేకపోయింది.భీమ్లా నాయక్ చిత్రానికి 8 లక్షల లైక్స్ రావడానికి గంట సమయం పడితే, సలార్ ట్రైలర్ కి దాదాపుగా మూడు గంటల సమయం పట్టింది.ఇక పోతే ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి అనుకున్న రేంజ్ రెస్పాన్స్ రాలేదు.
ట్రైలర్ లో ప్రభాస్( Prabhas ) స్క్రీన్ టైం తక్కువ ఉండడం తో అభిమానులు అసంతృప్తి చెందారు.

ఇక రాబొయ్యే రోజుల్లో భీమ్లా నాయక్ ట్రైలర్ ఫాస్టెస్ట్ లైక్స్ రికార్డు ని ఎవరు బద్దలు కొట్టబోతున్నారు అనేది చూడాలి.కచ్చితంగా ‘ఓజీ’ చిత్రం తో( OG Movie ) మేము ఆ రికార్డు ని బద్దలు కోరుతామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, లేదు మేమే ముందు కొడుతాము అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఛాలెంజ్ చేసుకుంటున్నారు .మరి ఈ రెండు సినిమాలలో ఏ చిత్రం ముందుగా ఈ రికార్డు ని కొట్టబోతుందో చూడాలి.