డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'సలార్' ట్రైలర్ ఎప్పుడో కన్ఫర్మ్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉండగా అన్ని కూడా వేటికవే అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో సలార్( Salaar ) ఒకటి.

 Salaar Movie Trailer Date Lock, Salaar, Salaar Trailer, Prabhas, Prashanth Neel,-TeluguStop.com

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.

ఎందుకంటే కేజిఎఫ్ సిరీస్ తో నీల్ ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.దీంతో ఈయన నెక్స్ట్ ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ తో కలవడంతో ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అన్ని బాగుండి ఉంటే ఈ సినిమా సెప్టెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేది.కానీ కొన్ని ఊహించని కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు.

ఇక మేకర్స్ క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ పై అఫిషియల్ గా అప్డేట్ తెలిపారు.ప్రభాస్ ఊర మాస్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామని తెలిపారు.ఇక రిలీజ్ పై క్లారిటీ రావడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు అని తాజా సమాచారం.

ఈ సినిమా నుండి ఆడియెన్స్ ఎక్కువుగా ఎదురు చూసేది ట్రైలర్ ( Salaar Trailer ) కోసం.మరి ఈ ట్రైలర్ పై ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ ప్రభాస్ బర్త్ డే ( Prabhas Birthday ) కానుకగా అక్టోబర్ 23న రిలీజ్ చేయనున్నారు అని ఓవర్సీస్ డిస్టిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది.దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇది కిక్ ఎక్కించే న్యూస్ అనే చెప్పాలి.

మరి ట్రైలర్ చూడాలంటే ప్రభాస్ పుట్టిన రోజు వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube