'సలార్' బడ్జెట్ అంతనా.. నీల్ ఈసారి అంత ఖర్చు పెట్టించాడా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) చేస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్న ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు సరికదా మరింత పెరుగుతుంది.ఆదిపురుష్ సినిమా ఇటీవలే జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఈయన క్రేజ్ ఎంత మాత్రం తగ్గడం లేదు.

 Salaar Movie Business Update, Salaar, Salaar Rights, Prabhas, Tollywood, Trase-TeluguStop.com

ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో భారీ నష్టాలు వచ్చాయి.

అయినప్పటికీ ఇప్పుడు అతి త్వరలోనే ప్రభాస్ నుండి రాబోతున్న నెక్స్ట్ సినిమాకు కూడా దీనికి మించిన బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది.ఈ రోజు ఈ సినిమా నుండి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) టీజర్ రిలీజ్ చేసారు.

ఈ టీజర్ తో అంచనాలు డబల్ చేసాడు.ఒక్క టీజర్ తోనే సినిమా మొత్తం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబందించిన బిజినెస్ గురించి క్రేజీ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాకు తెలుగు స్టేట్స్ లోనే భారీ బిజినెస్ కు నాంది పలుకుతున్నారని ఒక్క తెలుగు హక్కులే 200 కోట్లకు పైగా మేకర్స్ కోట్ చేస్తున్నట్టు టాక్.దీంతో తెలుగులో బిగ్గెస్ట్ బిజినెస్ నంబర్ సలార్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతానికి బిజినెస్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు కానీ అతి త్వరలోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.మరి ఏ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ జరుగుతుందో చూడాలి.కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube