సలార్ నుండి ఫైట్ సీన్ లీక్.. మాకు కావాలంటూ మేకర్స్ అదిరిపోయే రిప్లై..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉండగా అన్ని కూడా వేటికవే అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్టులలో భారీ హైప్ తెచ్చుకున్న మూవీ ‘‘సలార్”.

 Salaar Makers Interesting Reply On Fight Leak, Salaar, Prabhas, Social Med-TeluguStop.com

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు.రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మొదటి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

అసలైతే ఈ సినిమాను సెప్టెంబర్ 28నే రిలీజ్ చేయాల్సి ఉంది.కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.

మళ్ళీ ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.అసలు ఈ ఏడాది ఉంటుందో లేదో అని అనుకోగా ఎట్టకేలకు ఏడాది చివారైనా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో సోషల్ మీడియాలో ఎప్పుడు లీక్స్ అవుతూనే ఉంటాయి.ఆ లీక్ ఈ లీక్ అంటూ ఫ్యాన్స్ ను మభ్యపెడుతుంటారు.

మరి తాజాగా మరోసారి ఫ్యాన్స్ ను బోల్తా కొట్టించే పని చేసారు.ఈ సినిమా నుండి ఒక ఫైట్ సీన్ లీక్ అయ్యింది అని ఎవరికైనా కావాలంటే మెసేజ్ చెయ్యండి అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ పోస్ట్ చిత్ర యూనిట్ వరకు చేరగా ఈ పోస్ట్ పై వారు స్పందించారు.ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ మాకు కూడా ఆ లీక్ ఫైట్ సీన్ కావాలంటూ మెసేజ్ చేసారు.

దీంతో ఇదంతా అబద్దం అని సలార్ ( Salaar )నుండి ఎలాంటి లీక్ రాలేదంటూ క్లారిటీ తెలుస్తుంది.మేకర్స్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఫ్యాన్స్ లో మంచి వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube