శాకుంతలం యాక్షన్ స్టార్ట్ చేసిన సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలతో తన కెరియర్ ని కొనసాగిస్తుంది.రీసెంట్ గా ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో ఇండియన్ వైడ్ గా సమంత మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Sakunthalam Action Sequence Shooting, Samantha, Tollywood, Gunasekhar, Dil Raju-TeluguStop.com

ఇక ఆ వెబ్ సిరీస్ లో రాజీ పాత్ర బేస్ చేసుకొని సినిమాని తెరకెక్కిస్తారనే ప్రచారం కూడా నడుస్తుంది.ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ శాకుంతలంలో టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఫిమేల్ సెంట్రిక్ ఎలిమెంట్స్ తో ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ తెరక్కుతుంది.మైథలాజికల్ కాన్సెప్ట్ తో గుణశేఖర్ ఆవిష్కరిస్తున్న ఈ మూవీ షూటింగ్ లాక్ డౌన్ కి ముందే ఆరంభమైంది.

Telugu Dil Raju, Gunasekhar, Sakunthalam, Samantha, Tollywood-Movie

కంప్లీట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలోనే ఈ మూవీని దృశ్యకావ్యంగా తెరపై ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.సుమారు 50 కోట్ల భారీ బడ్జెట్ తో గుణశేఖర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే లాక్ డౌన్ నుంచి రీసెంట్ గా సడలింపులు ఇచ్చి షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో మరల శాకుంతలం కొత్త షెడ్యూల్ ని గుణశేఖర్ స్టార్ట్ చేశారు.ప్రస్తుతం ఈ మూవీలో కీలకంగా ఉండే యాక్షన్ సన్నివేశాలని హీరో, హీరోయిన్స్ పై చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.

మూవీలో మలయాళీ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సమంతకి జోడీగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.అతను దుష్యంతుడు పాత్రలో సినిమాలో నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే శాకుంతలం 50 శాతం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు గతంలో గుణశేఖర్ క్లారిటీ ఇచ్చారు.మరి ఈ షెడ్యూల్ లో సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube