జగన్‌ను మళ్లీ ఇరికించిన సాక్షి!

ఇప్పుడు ప్రతి పార్టీకి, నేతకూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సొంత మీడియా ఉంది.కొంతమంది నేరుగా అంగీకరించకపోయినా అది నిజం.

అలాగే ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి సాక్షి రూపంలో ఓ పేరున్న పత్రికే ఉంది.దీనిని సాక్షాత్తూ తాను, తన తండ్రి కలిసే ప్రారంభించారు కాబట్టి.

Sakshi Kept In Jagan-జగన్‌ను మళ్లీ ఇరికిం�

దాంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకునే అవకాశం జగన్‌కు లేదు.అయితే ఈ సొంత మీడియా పని ఏంటి? తమ యజమానులకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే కదా.సాక్షి కూడా అదే చేసింది.చంద్రబాబు హయాంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న ఎన్నో కథనాలు రాసింది.

అవి జగన్‌ అధికారంలోకి రావడానికి మేలు చేశాయి.కానీ ఇప్పుడవే కథనాలు జగన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

Advertisement

మొన్నటికి మొన్న సన్న బియ్యం విషయంలో తన సర్కార్‌ ఇరుక్కుపోతే.తన పత్రిక సాక్షే తప్పుగా రాసిందంటూ జగన్‌ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా ఇంగ్లిష్‌ మీడియం విషయంలోనూ అదే సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని జగన్‌ సర్కార్‌ను ఇరికించే ప్రయత్నం చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.గతంలో తాను పట్టణాల్లో ఇంగ్లిష్‌ ప్రవేశపెడితే జగన్‌ తీవ్రంగా వ్యతిరేకించారని, దీనికి సాక్షి పత్రికలో వచ్చిన కథనాలే సాక్ష్యమని బాబు చెప్పారు.

దీనిపై ఏం సమాధానం చెప్పాలో తెలియక జగన్‌ తికమకపడ్డారు.తన పత్రిక తననే ఇరికిస్తోందన్న అసహనం ఆయనలో కనిపించింది.

ఎప్పుడో 2016లో సాక్షిలో వచ్చిన కథనాన్ని పట్టుకొని ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారంటూ బాబుపై జగన్‌ ఎదురుదాడికి దిగారు.అయితే గతంలో తాను తీవ్రంగా వ్యతిరేకించిన అంశాలనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ అమలు చేస్తున్నారన్న విమర్శలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

వీటికి సాక్షి పత్రక కథనాలే సాక్ష్యాలుగా నిలుస్తుండటం జగన్‌కు మింగుడు పడటం లేదు.

Advertisement

తాజా వార్తలు