టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేతల రామకృష్ణారెడ్డి ( Sajjala ramakrishna Reddy )తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఏపీ ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టే విధంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై సజ్జల తనదైన శైలిలో బాబుపై సెటైర్లు వేశారు.” వైసీపీ ప్రభుత్వంలో కోటి 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుంది.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు. టిడిపి ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా ? ఉద్దానం కిడ్నీ సమస్య జగన్ శాశ్వత పరిష్కారం చూపారు.2014-19 మధ్య సీఎం గా ఉన్న చంద్రబాబు ఉద్దానానికి ఏం చేశాడు ? ఉద్దానం కోసం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏం చేశాడు ? చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు ? .తుఫాన్ విషయంలో పదివేల కోట్ల నష్టం వాటిలిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశాడు.ఈ లేఖ రాయడానికి చంద్రబాబుకు తలకాయ ఉందా అని సజ్జల ప్రశ్నించారు.
![Telugu Ap Cm Jagan, Pavan Kalyan, Telugudesam, Ys Jagan-Politics Telugu Ap Cm Jagan, Pavan Kalyan, Telugudesam, Ys Jagan-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/Sajjala-ramakrishna-Reddy-Nara-Lokesh-ap-CM-Jagan-TDP-telugudesam-party-Pavan-Kalyan-CBN.jpg)
ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా అని, తుఫాను పరిహారం విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేకుండా చేసాం.అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో ఏం సంబంధం అని ప్రశ్నించారు.హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్రానికి గెస్ట్ ల వస్తాడని, 2019లో చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారు .ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు కాబట్టే చంద్రబాబును జనం చెత్తబుట్టలో వేశారు.హైదరాబాద్ లో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు ( Chandrababu )లోకేష్( Nara Lokesh ) ఆయన దత్తపుత్రుడు కూడా రాష్ట్రానికి రావడం లేదని సజ్జల ఫైర్ అయ్యారు.
చంద్రబాబును చూస్తుంటే సినిమాలకు గుర్తుకొస్తున్నాయని.గతంలో విజయవాడ దుర్గ గుడిలో పూజలు చేసినట్లుగా ఇప్పుడు కూడా పూజలు ఏమైనా చేస్తున్నాడేమో అని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు.
బీసీ సీట్లలో నువ్వు నీ కొడుకు ఎందుకు పోటీ చేయడం లేదు ? చంద్రగిరి ని వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నారు అని ప్రశ్నించారు.
![Telugu Ap Cm Jagan, Pavan Kalyan, Telugudesam, Ys Jagan-Politics Telugu Ap Cm Jagan, Pavan Kalyan, Telugudesam, Ys Jagan-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/Sajjala-ramakrishna-Reddy-ap-CM-Jagan-TDP-telugudesam-party-Pavan-Kalyan-CBN.jpg)
2024 ఎన్నికల్లో కుప్పంతో సహా ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు .అత్యంత పారదర్శకంగా జరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి పాలనపై బురద చల్లుతున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు తప్పిదాలను మాకు ఆపాదించి రోజు పనికిమాలిన రాతలు రాస్తున్నారు కౌంటర్లు పెట్టి, తెలంగాణలో వారిని తీసుకువచ్చి ఓట్లను రిజిస్టర్ చేస్తున్నారని సజ్జల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.సిటిజన్ ఫారం పేరుతో ఒక బోగస్ ఫోరం ను పెట్టారని సజ్జల( Sajjala ramakrishna Reddy ) ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధం లేదు.చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యానికి ఈ విషయం తెలియదా ? నిమ్మగడ్డ రమేష్ కు తెలియదా అని ప్రశ్నించారు .అది చంద్రబాబు కోసం ఏర్పాటు చేసింది అని, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా ఫర్ఫెక్ట్ టీమ్ ను జగన్ ను పోటీకి దింపుతున్నారు అని, తప్పకుండా తామే గెలుస్తామని సజ్జల.ధీమా వ్యక్తం చేశారు.