టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు గత దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రియలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత తన వ్యక్తిగత కారణాలవల్ల గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి తరుణంలో సినిమాలకు దూరమయ్యారు.
ఇలా సినిమాలకు దూరంగా ఉంటున్నటువంటి సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.ఈమె నిర్మాతగా ట్రాలాల( Tralala ) అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు ఈ నిర్మాణ సంస్థ ద్వారా కొత్తవారికి అవకాశం కల్పించబోతున్నట్లు తెలియజేశారు.అయితే ఇటీవల బేబీ సినిమా(Baby Movie) ద్వారా హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వైష్ణవి చైతన్యకు (Vaishnavi Chaitanya)తన నిర్మాణ సంస్థలో సమంత అవకాశం కల్పించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
బేబీ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమా తర్వాత ఈమె విజయ్ దేవరకొండతో మరో సినిమాలో నటించబోతున్నారు.ఇవి తప్ప వైష్ణవి చైతన్యకు పెద్దగా అవకాశాలు లేవు ఎంతో టాలెంట్ ఉండి అవకాశాలు లేనటువంటి వైష్ణవి చైతన్యకు సమంత తన నిర్మాణ సంస్థలో అవకాశం కల్పించబోతున్నారని, అందుకు ముందుగానే వైష్ణవి చైతన్యకు ఏకంగా కోటి రూపాయలు పంపించారని తెలుస్తోంది.ఏది ఏమైనా వైష్ణవి చైతన్య మాత్రం మంచి అవకాశం అందుకున్నారు అంటూ ఈ వార్తలపై కామెంట్స్ చేస్తున్నారు.