ఏపీలో జగన్, చంద్రబాబు మధ్య రాజకీయ వార్ గత పదేండ్లకు పైగా సాగుతోంది.వైఎస్సార్ కుటుంబం నేటికీ యాంటీ టీడీపీగానే ఉంది.
వైఎస్ ఫ్యామిలీ నుంచి చాలామంది రాజకాయాల్లో ఉన్నారు.ఎవరూ టీడీపీతో సన్నిహితంగా ఉన్న దాఖలాలు లేవు.
కానీ, జగన్‌పై గళం విప్పిన సొత వారిని కూడా తప్పుబడుతూ.టీడీపీకి మద్దతుదారులగా మార్చేస్తున్నారని సమాచారం.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య ఉదంతంలో ఆమె కుమార్తె డాక్టర్ సునీత పోరాటం అలుపెరగనిది.దోషులు ఎవరో తేల్చాలంటూ మూడేండ్లకు పైగా పోరాడుతున్నారు.
ఫలితంగా సీబీఐ విచారణ కూడా జరుగుతోంది.కాగా ఆమె కానీ, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి కానీ ఇచ్చిన వాంగ్మూలాలు ఏపీ రాజకాయాలను కలకలం రేపుతున్నాయి.
ఇదంతా తిరిగి జగన్‌మీద ఒత్తిళ్లు తెచ్చేలా మారుతున్నాయి. వైసీపీ క్యాడర్‌తో సహా ప్రజలు కూడా ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి.
మొత్తంగా నిజం నిగ్గు తేల్చాల్సింది మాత్రం సీబీఐ.కాగా దర్యాప్తు జరుగుతుండగానే తాజాగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు.
సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో వెల్లడించిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి.
డాక్టర్ సునీత చంద్రబాబు చేతిలో పావుగా మారారని కామెంట్స్ చేయడం చర్చణీయాంశం అవుతోంది.జగన్ మీద జరుగుతున్న కుట్రలో సునీత, ఆమె భర్త భాగమవుతున్నరని చెప్పుకొచ్చారు.ఏకంగా వైఎస్ ఫ్యామిలీ నుంచే రాజకీయాలపట్ల ఎలాంటా ఆసక్తి లేరి సునీత, ఆమె భర్త టీడీపీ వైపు మళ్లారంటూ చెప్పడం విమర్శలకు తావిస్తోంది.
కానీ, సునీత పోరాటం కూడా అర్థవంతమైనదే.తనతండ్రిని చంపిన వారిని కటకటాలపాలు చేయాలనుకుంటోంది.ఇదంతా పక్కన పెట్టి రాజకీయాలు చొప్పించి ఆమె బాబు కు మద్దతురాలుగా వక్రీకరించడం గమనార్హం.మొత్ంగా జగన్ విమర్శించిన వారంతా చంద్రబాబు మనుషులే అనడం సరికాదు.
ఏదిఏమైనా వైసీపీకి బాబు ఫోబియా బాగానే పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.