గత వారం రోజులుగా పొత్తులపై చర్చ జరుగుతోంది ఇంకా ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉంది…ప్రజలోకి పొత్తుల అంశాన్ని తీసుకు వెళ్లేందుకు ఈ ప్రయత్నం లా కనిపిస్తోంది పొత్తులు అవసరం.ఉంటాయి కూడా….
జాతీయ స్థాయి లో కూడా పొత్తులు ఉంటాయి భావ సారూప్యత ఉన్నప్పుడు పోత్తులు ఉంటాయి.అంతా వ్యూహం అని పవన్ అంటున్నారు….
ప్రజలంటే ఇంత చులకనా…
చంద్రబాబు త్యాగం అంటున్నారు.మరోవైపు పవన్ నేను సీఎం అంటున్నాడు.
అసలు ఎవరెవరు త్యాగం చేస్తారు.టీడీపీ జనసేన బీజేపీ మాత్రమే ప్రతిపక్షం లో ఉన్నాయి.
వైసిపి వ్యతిరేక ఓట్ చీల్చాలని లేకపోతే ఎవరు కలుస్తారో చెప్పాలి.రాజకీయ స్పష్టత లేకుండా మాట్లాడితే లెక్కలేని తనం…కనిపిస్తోంది.టీడీపీ జనసేన కు 2014 నుంచి అండర్ స్టాండింగ్ ఉంది….2019 లో చంద్రబాబు ను పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.కేవలం అధికారం లో చంద్రబాబు ను కూర్చోపెట్టడమే ధ్యేయం గా పవన్ కనిపిస్తున్నారు.
చంద్రబాబు .దివాలకోరుతనం…లెక్కలేనితనం ప్రస్తుతం కనిపిస్తోంది.బీజేపీ పై 2019 లో తీవ్ర విమర్శలు చేసారు…ఒక విధానం అంటూ లేకుండా చంద్రబాబు ఉన్నారు…అప్పట్లో వైఎస్ జాతీయపార్టీ లో ఉండి పొత్తులు పెట్టుకున్నారు.
ఇప్పుడు సీఎం జగన్ కూడా చాలా స్పష్టత తో ఉన్నారు రాష్ట్రంలో అద్భుతం జరగడం అంటే జనసేన టీడీపీ కలవడమే.పవన్ కళ్యాణ్ కు సినిమాలో లాగా ప్రతి రీల్ మారుతూ ఉండాలి.
రాజకీయాలు సినిమా కాదు .పొత్తు పెట్టుకోవడం విప్లవాత్మకం అంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు…జనాన్ని ఫూల్స్ చేసే విధంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ప్రకటనలు ఉన్నాయి.







