అమరావతి: వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల కామెంట్స్.ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో రియలా.? ఫేకా.? అనేది తేలాకే చర్యలుంటాయి.అరగంటలోనో.గంటలోనో రిపోర్ట్ వస్తుందని టీడీపీ అంటోంది.రిపోర్టు ఇంకా రాలేదు.విచారణ జరుగుతోంది.
కొన్నాళ్లు ఆగితే కొంపలేం మునిగిపోవు.మాధవ్ తనను వేధించారనే ఫిర్యాదు కూడా ఎవరి దగ్గర నుంచి లేదు.
మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహరం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దది.ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ అవునా.? కాదా.? అనేది ఇంకా తేలలేదనే విషయం గుర్తుంచుకోండి.ఏడేళ్లైనా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ పై క్లారిటీ రాలేదు.చంద్రబాబు ఎన్నికలనే భ్రష్టు పట్టించే విధంగా అడ్డంగా దొరికిపోయారు.టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది.మళ్లీ మేమే అధికారంలోకి వస్తామంటూ టీడీపీ పగటి కలలు కంటోంది.
కార్యకర్తలను కాపాడుకునేందుకు టీడీపీ ఏదేదో గిమ్మిక్కులు చేస్తోంది.ప్రజల ఆదరణతోనే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది.మోడీతో చంద్రబాబు ఫొటో దిగిన తర్వాతే టీడీపీలో ధైర్యం పెరిగినట్టుంది.ప్రజాశీస్సులు కోరే ప్రయత్నం మాని.
ఊత కర్ర సాయంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణలో బీజేపీకి సాయం అందించి.ఏపీలో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం టీడీపీ చేస్తోంది.2018 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న రాహుల్ గాంధీ ఏమయ్యాడో అందరికీ తెలిసిందే.ప్రభుత్వ వ్యతిరేక ఓటు 2019లో చీలాలట.2024లో చీలకూడదట.గత ఎన్నికల్లో ఓట్లను చీల్చేందుకు పవన్ విడిగా పోటీ చేశారు.ఇప్పుడేమో కలిసి వెళ్తామంటున్నారు.
ఏపీకి ఇది చేశానని చెప్పుకునే పని చంద్రబాబు ఒక్కటైనా చేశారా.? జగన్ను ఏం చేయాలనుకున్నా.వైసీపీ చెక్కు చెదిరే ప్రసక్తే ఉండదు.తన ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడే ఇలాంటి ప్రచారం చేస్తారు.ప్రస్తుతం టీడీపీ అదే చేస్తోంది.టీడీపీ-బీజేపీ-జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే.
అది డొల్లతనమే.ఆ పార్టీలు కూటమిగా ఏర్పడితే వాస్తవాలను ప్రజలకు వివరిస్తాం.
గతంలో విడిపోయిన వాళ్లు.మళ్లీ ఎందుకు జట్టు కట్టారోననేది ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తాం.
ప్రజల విశ్వాసం పొందితేనే అధికారంలోకి వస్తామనేది మా నమ్మకం.ఆ పార్టీలు తాత్కాలికంగా కలిస్తే మాకొచ్చే నష్టమేం లేదు.
నీతి ఆయోగ్ సమావేశంలో అజెండా ప్రకారమే సీఎం జగన్ మాట్లాడారు.అజెండాతో సంబంధం లేకుండా కొందరు కొన్ని అంశాలు ప్రస్తావించినా.పరిశీలించండని ప్రధాని అధికారులకు సూచించారు తప్ప.పెద్దగా చేసిందేమీ లేదు.
అజెండాలో లేని ప్రత్యేక హోదా గురించి నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించినా లాభం ఉండదు.నీతి ఆయోగ్ సమావేశం వేదికగా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినా.
పెద్దగా ఒరిగేదేం ఉండదని మా అభిప్రాయం.ప్రత్యేక హోదా గురించి ఎక్కడ ప్రస్తావించాలో అక్కడ ప్రస్తావిస్తాం.