ఆమెను బుట్టలో పడేసే పనిలో అఖిల్‌!!

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

 Saisha Sehgal Fall In Love With Akhil-TeluguStop.com

ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ సాహేసా సైగల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.అఖిల్‌తో పాటు సాహేసా సైగల్‌కు కూడా ఇది తొలి సినిమానే అనే విషయం తెల్సిందే.

వీరిద్దరు కూడా షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారట.ఇద్దరికి మొదటి సినిమా అవ్వడంతో ఇద్దరిలో ఏ ఈగో బావాలు లేకుండా కలిసి పోయారట.

ఈ నేపథ్యంలో అఖిల్‌కు ఆమెపై ప్రేమ కలిగిందని చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.

సాహేసా సైగల్‌తో ఈయన ప్రేమాయణం సాగించాలని కోరుకుంటున్నాడని, అందుకోసం ఆమెను ఫ్లాట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే అఖిల్‌ గురించి మాట్లాడిన సాహేసా అతను మంచి సహ నటుడు అని, అన్ని విధాలుగా తనకు పూర్తి సహకారంను అఖిల్‌ ఇస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.ఇక అఖిల్‌ తన మనస్సులోని విషయాన్ని సాహేసాకు చెప్పాడా లేక చెప్పాలనుకుంటున్నాడా అనే విషయంపై క్లారిటీ లేదు.

మొత్తానికి సాహేసాపై అఖిల్‌ ప్రేమను కురిపిస్తున్న మాట అయితే వాస్తవం అని చిత్ర యూనిట్‌ సభ్యులు గట్టిగానే చెబుతున్నారు.షూటింగ్‌ సమయంలో వీరిద్దరి ప్రవర్తనే అందుకు సాక్షం అని కూడా అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube