నేటి నుండి ‘సర్దార్‌’ షురూ

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌ 2’ అలియాస్‌ ‘సర్దార్‌’ మూవీ నేటి నుండి రెగ్యుర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.ఇటీవలే దర్శకుడు బాబీ ఈనెల 29 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను జరుపబోతున్నట్లుగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెల్సిందే.

 ‘sardar’ Movie Will Kick Start Today-TeluguStop.com

ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి అయినప్పటికి ఆ షెడ్యూల్‌లో పవన్‌ కళ్యాణ్‌ నటించక పోవడంతో ఆ షెడ్యూల్‌కు పెద్దగా ప్రాముఖ్య లేదు.అఫిషియల్‌గా ఈ సినిమా ఇప్పుడు ప్రారంభం కాబోతుంది.

దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా గురించిన వార్తలు మీడియాలో వస్తున్నాయి.మొదట ఈ సినిమాకు సంపత్‌ నంది దర్శకత్వం అన్నారు, ఆ తర్వాత ఆయన్ను తప్పించి ‘పవర్‌’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బాబీని ఎంపిక చేయడం జరిగింది.

ఆ తర్వాత హీరోయిన్‌గా అనీష ఆంబ్రోస్‌ను ఎంపిక చేశాం అన్నారు.ఇప్పుడు ఆమె కూడా సినిమాలో లేదు.మరో హీరోయిన్‌ కోసం వెదికే పనిలో ఉన్నారు.ప్రస్తుతం పలువురు హీరోయిన్‌ల పేర్లను చిత్ర యూనిట్‌ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి ఈ సినిమా ప్రారంభం అవ్వడంతో మెగా ఫ్యాన్స్‌ సంతోషంగా ఉన్నారు.సినిమా పూర్తి అయ్యే వరకు షూటింగ్‌ ఏకధాటిగా జరిగే అవకాశాలున్నాయి.

సినిమా అసలు టైటిల్‌ ఏంటి, హీరోయిన్‌ ఎవరు అనే విషయాలపై అతి త్వరలో క్లారిటీ రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube