మారుతున్న పరిస్థితుల్లో బాలీవుడ్ స్టార్స్ సైతం మన సినిమాల్లో భాగం అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ ( Saif Ali Khan ) కూడా టాలీవుడ్ లో గ్రాండ్ లాంచింగ్ కు సిద్ధం అవుతున్నాడు.
బాలీవుడ్ లో మూడు దశాబ్దాలకు పైగానే సక్సెస్ ఫుల్ హీరోగా కెరియర్ కొనసాగించిన సైఫ్ అన్ని రకాల పాత్రలను చేయడానికి ఇష్ట పడుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడిగా నటించాడు.
ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఇప్పుడు మరో సౌత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.
గత కొన్ని రోజులుగా సైఫ్ మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఆ సినిమా ఏంటో అందరికి తెలుసు.

ఎన్టీఆర్ ( NTR ) – కొరటాల ( Koratala Shiva ) కాంబోలో తెరకెక్కుతున్న NTR30 ప్రాజెక్ట్ లో విలన్ రోల్ కోసం మేకర్స్ ఈయన్ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి.అయితే దీనిని నిజం చేస్తూ ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాలో సైఫ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా ఈయన ఎన్టీఆర్ 30 షూటింగ్ లో జాయిన్ అయినట్టు పేర్కొన్నారు.సెట్స్ లో ఎన్టీఆర్, కొరటాల, సైఫ్ అలీ ఖాన్ కలిసి ఉన్న ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేసారు.
వెల్కమ్ సైఫ్ అని పోస్ట్ చేయడంతో ఈ సినిమాపై ఇప్పుడు మరింత హైప్ పెరిగింది.

ఇదిలా ఉండగా ఇటీవలే షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్టు టాక్.ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.







