ఇటీవలే కాలంలో చిన్న చిన్న కారణాలకే దారుణాలకు పాల్పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.సర్దుకుపోయే గుణం లేకపోవడం, అనవసర అనుమానాలు, ఆకర్షణకు లోనై అక్రమ సంబంధాలు వివిధ దారుణాలకు కారణం అవుతున్నాయి.
మనిషి తానేం చేస్తున్నాడో తెలియక విచక్షణ రహితంగా తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాడు.ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన చెన్నై పుదువాయ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే చెన్నై( Chennai )లోని కొరటూరు లోని సంచార తెగకు చెందిన కుమరేశన్ (32) పుదువాయ్ రోడ్డు పక్కన నివాసం ఉంటున్నాడు.కుమరేశన్, రాజేశ్వరి అనే మహిళను వివాహం చేసుకున్నాడు.
వీరికి నలుగురు కుమారులు సంతానం.అయితే కుమరేశన్, సంగీత (24) అనే మహిళను వివాహం చేసుకొని పుదుచ్చేరి కిరుమామ్ బాక్కంకి లో కొన్ని నెలలుగా కాపురం ఉంటున్నాడు.
సంగీత 29 రోజుల క్రితం ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.శనివారం రాత్రి కుమరేశన్, సంగీత పాపతో కలిసి నిద్రపోయారు.ఆదివారం ఉదయం లేచి చూసేసరికి పాప కనిపించలేదు.భార్యభర్తలు ఇద్దరూ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా వెతికిన ఎటువంటి ఆచూకీ లభించలేదు.

ఈ క్రమంలో బీచ్ లో ఉండే ఇసుకలో పాతిపెట్టిన ఓ చిన్నారి పాదం కాస్త బయటకు కనిపిస్తూ ఉండడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని చిన్నారి మృతి దేహం బయటకు తీసి విచారణ చేపట్టారు.కుమరేశన్, సంగీతలకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని తమ బిడ్డే అంటూ విలపించారు.తన మామే బిడ్డను హత్య చేసి ఉంటాడని కుమరేశన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే పోలీసుల( Police ) కు అందరినీ విచారించే క్రమంలో సంగీత పై కాస్త అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారిస్తే అసలు నిజం బయటపడింది.సంగీత తన బిడ్డను చంపినట్లు అంగీకరించింది.తన భర్త బిడ్డ పుట్టినప్పటి నుండి అనుమానంతో చిత్రహింసలు చేస్తూ బిడ్డ తనకే పుట్టిందా అని తరచూ వేధించేవాడని తెలిపింది.నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చినందుకు అనారోగ్యంతో బిడ్డడు పెంచడం కష్టంగా మారిందని, ఇందుకు తోడు భర్త చిత్రహింసలు పెడుతూ ఉండడంతో చిన్నారిని చంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.







