పవన్( Pawan Kalyan ), సాయి ధరం తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.సముద్రఖని( Samuthirakani ) డైరెక్షన్ లో తెరకెక్కిన వినోదయ సీతం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా నటిస్తున్నారు.

అయితే సినిమా రీమేక్ అని అందరికీ తెలిసినా సాయి ధరం తేజ్( Sai Dharam Tej ) మాత్రం తాము చేస్తుంది రీమేక్ కాదని అంటున్నాడు.వినోదయ సీతం మూల కథను మాత్రమే తీసుకున్నామని తెలుగులో చాలా మార్పులు చేశామని అంటున్నాడు సాయి ధరం తేజ్.

అసలు తాము చేస్తుంది రీమేక్ కాదని చెప్పడం అందరికి షాక్ ఇస్తుంది.మాతృఇక దర్శకుడితో చేస్తూ రీమేక్ కాదనడం ఏంటని కొందరు అంటున్నారు.అయితే తేజ్ ఉద్దేశ్యం ప్రకారం తెలుగులో ఈ సినిమాకు చాలా మార్పులు చేసినట్టు అర్ధమవుతుంది.

మరి రీమేక్ కానీ రీమేక్ సినిమాపై తేజ్ వర్షన్ అలా ఉండగా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.వినోదయ సీతం( Vinodhaya Sitham ) రీమేక్ గా వస్తున్న ఈ సినిమా జూలై 28న రిలీజ్ ప్లాన్ చేశారు.అఫీషియల్ గా రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ విరూపాక్ష ఈవెంట్ లో సాయి ధరం తేజ్ ఫ్లోలో పవన్ సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పాడు.ఈ రీమేక్ కి కూడా త్రివిక్రం అన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్నాడన్న విషయం తెలిసిందే.







