మెగా హీరో సాయి ధరం తేజ్( Saidharam Tej ) విరూపక్షతో హిట్ అందుకోగా బ్రో సినిమాతో జస్ట్ ఓకే అనిపించాడు.బ్రో( Bro Movie ) ఆరంభం హడావిడి బాగానే చేసినా ఫైనల్ గా మాత్రం అది లాస్ ప్రాజెక్ట్ అయినట్టు తెలుస్తుంది.
దాదాపు బ్రో కి జరిగిన బిజినెస్ కి పాతిక కోట్ల దాకా లాస్ వచ్చిందని టాక్.ఇదిలాఉంటే బ్రో తర్వాత సాయి తేజ్ సంపత్ నంది డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.
ఈ సినిమా కొన్నాళ్లుగా చర్చల్లో ఉన్నా సరే ముహుర్తం మాత్రం పెట్టుకోలేదు.సాయి తేజ్ సంపత్ నంది( Sampath Nandi ) ఈ ఇద్దరు కలిసి ఓ మాస్ ఎంటర్టైనర్ అందిస్తున్నారని తెలుస్తుంది.
ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం సాయి తేజ్ సంపత్ నంది కలిసి చేసే సినిమాకు దసరాకి ముహుర్తం పెడుతున్నారని తెలుస్తుంది.దసరా ( Dasara ) రోజే ఈ సినిమా ఓపెనింగ్ ముహూర్తం ఉంటుందని ఆ తర్వాత వారం నుంచే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఇద్దరు క్రేజీ భామలు డిస్కషన్స్ లో ఉన్నారని తెలుస్తుంది.మొత్తం కాస్ట్ అండ్ క్రూ సినిమా అనౌన్స్ మెంట్ ఒకేసారి చేస్తారని తెలుస్తుంది.
మరి సంపత్ నంది సాయి తేజ్ కాంబో మెగా ఆడియన్స్ కి ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి.