తెలుగు లో వచ్చిన చాలా సినిమాలు ఫస్ట్ హాఫ్ నార్మల్ గా ఉండి సెకండ్ హాఫ్ బాగుంటే చాలు మంచి విజయాల్ని సాధిస్తాయి…అప్పట్లో ఇండస్ట్రీ లో ఉన్న చాలా సినిమాలు ఇలా హిట్ అయినవే… అయితే మరి కొన్ని సినిమాలు మాత్రం సినిమా మొత్తం బాగానే ఉండి చివర్లో క్లైమాక్స్( Climax ) సెట్ అవ్వకపోవడం వల్ల ప్లాప్ అయినా సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.ఆ సినిమాలేంటో ఒకసారి మనం తెలుసుకుందాం…
ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన యోగి సినిమా( Yogi Movie ) భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని అందరు అనుకున్నారు కానీ అందరికి షాక్ ఇస్తూ ఈ సినిమా ప్లాప్ అయింది…నిజానికి ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాక సూపర్ గా ఉన్నప్పటికీ క్లైమాక్స్ లో హీరో వాళ్ల అమ్మ మొహం కూడా చూడకుండా ఆమె చనిపోతుంది, కనీసం తల్లిని చివరి చూపుకూడా చూడకుండా మిగిలిపోయిన హీరో కథ గా ఈ సినిమా ఉండటం తో జనాలకి ఈ సినిమా నచ్చలేదు.దాంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది…క్లైమాక్స్ వేరేగా ఉంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది…
ఇక ఇలాంటి కోవకే చెందిన మరో సినిమా ఏక్ నిరంజన్( Ek Niranjan Movie ) ఈ సినిమా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాక అసలు బోర్ అనేది లేకుండా ఉంటుంది కానీ చివర్లో వాళ్ల ఫ్యామిలీ ని కలవకుండా డైరెక్టర్ పెట్టిన టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసాడు అయినాకూడా అది వర్క్ అవుట్ అవ్వలేదు దింతో ఈ సినిమా కూడా ప్లాప్ అయింది క్లైమాక్స్ బాగాలేకపోవడం వల్ల ప్రభాస్ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి…