న్యాచురల్ స్టార్ నాని హీరోగా, సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం శ్యామ్ సింగరాయ్.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాలతో పాటు హీరోయిన్ సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అలాగే సాయి పల్లవి అద్భుతమైన డాన్సర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా ఈ సినిమా నుంచి సాయి పల్లవికి సంబంధించిన ఒక క్లాసికల్ డాన్స్ వీడియోను విడుదల చేయడంతో ఈ పాట పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది.

ఈ సినిమాలో సాయి పల్లవి ఈ డాన్స్ చేయడం కోసం ఎంతో కష్టపడిందని ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాహుల్ తెలిపారు.ఇలా పగలంతా రిహార్సల్స్ చేస్తూ రాత్రి డాన్స్ ఫర్ఫార్మెన్స్ చేసేదని, ఇలా ఏడు రోజులపాటు ఈ పాట షూటింగ్ నిరంతరంగా కొనసాగిందని, ఈ పాట చేయడం కోసం సాయి పల్లవి ఎంతో కష్టపడిందని ఈ సందర్భంగా డైరెక్టర్ రాహుల్ సాయిపల్లవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందనే విషయం తెలియాలంటే మరొక రెండు రోజులు వేచి ఉండాలి.