హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించకుండా సక్సెస్ కావడం అంటే చాలా కష్టతరమైనటువంటి విషయమనే చెప్పాలి.

కానీ కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఇది సాధ్యం.

అప్పట్లో సావిత్రి సౌందర్య వంటి వారు ఇలా గ్లామర్ షో చేయకుండా సినిమా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు.అయితే ఈ జనరేషన్ లో మాత్రం ఈ కోవలోకి సాయి పల్లవి( Sai Pallavi ) వస్తారని చెప్పాలి.

సాయి పల్లవి ప్రేమమ్ సినిమా( Premam Movie ) ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Sai Pallavi Shocking Trolls On Surgerys Full Details, Sai Pallavi, Sai Pallavi P

ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా అన్ని భాష చిత్రాలలో అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటన పరంగా ఎంతో విభిన్నమైనటువంటి పాత్రలను ఎంపిక చేసుకొని మంచి సక్సెస్ అందుకుంటున్నటువంటి సాయి పల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా శారీరక సౌందర్యం గురించి మాట్లాడారు.

Advertisement
Sai Pallavi Shocking Trolls On Surgerys Full Details, Sai Pallavi, Sai Pallavi P

ప్రేమమ్ సినిమా సమయంలో సాయి పల్లవి ఫేస్ మీద మొటిమలు( Pimples ) ఎక్కువగా ఉండేవి అయితే ఈమెకు ఈ సినిమాలో అవకాశాలు రావడానికి ఇవి కూడా కాస్త కారణమయ్యాయని చెప్పాలి.

Sai Pallavi Shocking Trolls On Surgerys Full Details, Sai Pallavi, Sai Pallavi P

అయితే ప్రస్తుతం ఈమె మొహంపై ఏ విధమైనటువంటి మొటిమలు లేకపోవడంతో సర్జరీ( Surgery ) ఏమైనా చేయించుకున్నారా అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని తెలిపారు.టీనేజ్ అమ్మాయిలకు ఇలా మొటిమలు రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతాయి.

అవి పోవడానికి ఏ విధమైనటువంటి చికిత్స అవసరం లేదని వాటంత అవే పోతాయని సాయి పల్లవి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే తన జుట్టు కోసం మాత్రం అలోవెరా జెల్ వాడుతానని అలాగే ఆర్గానిక్ ఆహార పదార్థాలను తీసుకుంటాను అంటూ ఈమె వెల్లడించారు.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!
Advertisement

తాజా వార్తలు