టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను దక్కించుకున్న చిత్రంగా విరాటపర్వం నిలిచింది.ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తుండగా, అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడం ఖాయమని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.కాగా తెలంగాణలో జరిగిని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఓ నక్సలైట్ పాత్రలో తన విశ్వరూపాన్ని చూపించనుండగా, అతడిని ప్రేమించే పక్కా పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.తాజాగా ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
ఈ టీజర్ ఆద్యంతం సాయి పల్లవి తన పర్ఫార్మెన్స్, వాయిస్ ఓవర్‌తో కట్టిపడేసిందని చెప్పాలి.నక్సలైట్ అయిన ఓ వ్యక్తికి అభిమానిగా మారి, అది ప్రేమగా మారడంతో అతడి కోసం ఆమె ఎలాంటి అడుగులు వేసిందనే కాన్సెప్ట్ ఈ సినిమా టీజర్‌లో మనకు చూపెట్టారు.
సాయి పల్లవి ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసుకుని, ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ బ్యూటీగా తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు బాగా కలిసొస్తుందని చెప్పాలి.
ముఖ్యంగా బీజీఎంలో వచ్చే సంగీతం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని చిత్ర టీజర్ చూసతే తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్, నివేదా పేతురాజ్ వంటి నటీనటులు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌కు చేరుకున్నాయి.
వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.అచ్చమైన, స్వచ్ఛమైన ప్రేమకథకు సంబంధించిన విరాటపర్వం టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.