లాంగ్ గ్యాప్ తీసుకుని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) నటించిన లేటెస్ట్ సినిమా ”విరూపాక్ష”( Virupaksha ).నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.
అందుకు కారణం కూడా లేకపోలేదు.ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.
మేకర్స్ కూడా భారీ నిర్మాణ విలువలతో ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాను నిర్మించారు.
సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో థియేట్రికల్ ట్రైలర్ (Virupaksha Trailer) కూడా రిలీజ్ చేసారు మేకర్స్.హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీ ప్లెక్స్ లో ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ జరిగింది.

ఈ ట్రైలర్ థ్రిల్లింగ్ అంశాలతో చాలా అద్భుతంగా ఉంది అనే చెప్పాలి.మేకర్స్ ఎలాంటి వివరాలు అందించకుండానే థ్రిల్లింగ్ ట్రైలర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపారు.రుద్రవనం అనే గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ కొనసాగుతుంది.ఆ గ్రామస్థుల ఆకస్మిక మరణాలను సాయి తేజ్ ఎలా ఛేదించాడు? అనే దానిపై మరింత క్యూరియాసిటీ పెంచేశారు.

ఏప్రిల్ 21న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.మరి ట్రైలర్ తోనే హైప్ పెంచేసిన ఈ సినిమా తేజ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ సైతం చెప్పుకుంటున్నారు.చూడాలి ఈయన కెరీర్ కు ఈ సినిమా ఎలా ప్లస్ అవుతుందో.ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.







