మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినటువంటి వారిలో నటుడు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) ఒకరు.హీరోగా పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా ఈ సినిమాతో ప్రారంభమైనటువంటి తన సినీ ప్రయాణం 9 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.ఈ తొమ్మిది సంవత్సరాలు కాలంలో సాయి తేజ్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇక ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఈ క్రమంలోనే నేటిజన్స్ వరుసగా ఈయనని ప్రశ్నించడంతో ఈయన కూడా సమాధానాలు చెబుతూ వచ్చారు.ఇందులో భాగంగానే మీరు ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు.విరూపాక్ష ( Virupaksha ) లాంటి సినిమాలను చేయొచ్చు కదా అంటూ నేటిజన్స్ ప్రశ్నించడంతో నేను ఒకే జానర్ లో కాకుండా అన్ని జానర్ లోను సినిమాలు చేయడానికి ఇష్టపడతానని తెలియజేశారు.
ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి ఒక మాటలో చెప్పండి అంటూ ఈయనని ప్రశ్నించడంతో గురువుగారు అంటూ సాయి తేజ్ సమాధానం చెప్పారు.ఇక సాయి తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.

ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం కూడా ఉండబోతుందంటూ సినిమా క్లైమాక్స్ లో స్పష్టంగా చూపించారు.అయితే ఈ సినిమా సీక్వెల్ చిత్రం గురించి తాజాగా ఒక నెటిజన్ ప్రశ్నిస్తూ విరూపాక్ష 2( Virupaksha 2 ) ఎప్పుడు రాబోతుంది అంటూ అడగగా అందుకు సాయి ధరమ్ తేజ్ సమాధానం చెబుతూ.అది శాసనాల గ్రంథంలో చూసే చెప్పాలి అంటూ సమాధానం ఇచ్చారు.విరూపాక్ష సినిమా సీక్వెల్ చిత్రం గురించి సాయి తేజ్ చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈయన చివరిగా పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో(Bro) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ప్రస్తుతం గాంజా శంకర్(Ganjaa Shankar) సినిమా పనులలో బిజీగా ఉన్నారు త్వరలోనే ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.







