సాహసం శ్వాసగా సాగిపో రివ్యూ

చిత్రం : సాహసం శ్వాసగా సాగిపో బ్యానర్ : ద్వారక క్రియేషన్స్ దర్శకత్వం : గౌతమ్ మీనన్ నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి సంగీతం : ఏఆర్ రెహమాన్ విడుదల తేది : నవంబర్ 11, 2016 నటీనటులు : నాగచైతన్య, మంజీమ మోహన్ చాలా గ్యాప్ తరువాత ప్రేమమ్ రూపంలో మంచి సక్సెస్ ని రుచిచూసాడు నాగచైతన్య.

ఇక నాగచైతన్యకి తొలి సక్సెస్ ని అందించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్.

విరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో సాహసం శ్వాసగా సాగిపో మీద మంచి అంచనాలు ఉన్నాయి.మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా లేదా చూద్దాం.

కథలోకి వెళ్తే .రజినీకాంత్ (నాగచైతన్య) ఎమ్.బి.ఏ చేసి జీవితంలో ఏం చేయాలో అలోచస్తూ ఉంటాడు.బైక్ మీద కన్యాకుమారి దాకా ప్రయాణించి ఆ తరువాత లైఫ్ గురించి ఆలోచించాలని అనుకుంటాడు.

తన చెల్లి ద్వారా పరిచయం అవుతుంది లీలా (మంజీమ మోహన్).ఇద్దరు కలిసి కన్యాకుమారికి బైక్ మీద బయలుదేరుతారు.

Advertisement

తిరుగు ప్రయాణంలో జరిగిన ఓ యాక్సిడెంట్ రజినీకాంత్ జీవితాన్నే మార్చేస్తుంది.తాను కొందరిని చంపేంత దూరం తీసుకెళ్తుంది.

ఇంతకి ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? రజినీకాంత్, లీలా ప్రేమకథ ఎటువైపు చేరిందో తెలుకోవాలంటే సినిమా చూడాలి.నటీనటుల నటన గురించి నాగచైతన్య పూర్తిగా తన స్టయిల్లో కనిపిస్తాడు ఫస్టాఫ్ అంతా.

తను అవలీలగా చేసే రొమాంటిక్ బాయ్ పాత్ర.అలాంటి పాత్రలు నాగచైతన్య ఎంత బాగా చేస్తాడో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

సెకండాఫ్ లో చైతు నటన కొత్త పుంతలు తొక్కి రియలిస్టిక్ గా అనిపిస్తుంది.కాని క్లయిమాక్స్ లో పూర్తిగా తేలిపోయాడు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
2025 లో మన స్టార్ హీరోలు బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నారా..?

మంజీమా మోహన్ ముంబై నుంచి వచ్చి బొమ్మలా కనిపించే హీరోయిన్ల కంటే చాలా నయం.బాగా చేసింది కూడా.పోలీస్ ఆఫీసర్ గా బాబా సైగల్ సినిమాకి కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చినా, ఈ కాస్త సబ్టిల్ లేదా ఇంటెన్స్ గా ఉండుంటే బాగుండేదేమో.

Advertisement

మిగితా పాత్రధారులంతా బాగా చేశారు.సాంకేతికవర్గం పనితీరు మాట్లాడుకుంటే రోజంతా ఏ ఆర్.రెహమాన్ గురించి మాట్లాడుకోవచ్చు.సినిమా సగమే ఉడికింది కాబట్టి ఆ సంగీతాన్ని జనాలు మర్చిపోయేలా చేస్తుందేమో కాని, సంగీత ప్రియులు తెరపై ఏం జరుగుతుందో చూడకుండా, కళ్ళు మూసుకోని ఆ పాటలు, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటూ కూర్చున్నా సంబరపడిపోతారు.

ఈ సినిమాకి, నాగచైతన్య కన్నా, గౌతమ్ మీనన్ కన్నా, అతిపెద్ద ఆస్తి ఆయనే.సినిమాటోగ్రాఫి బాగుంది ప్రతి గౌతమ్ మీనన్ సినిమాలో ఉన్నట్లే.ఎడిటింగ్ దెబ్బతీసింది.

నిర్మాణ విలువలు బాగున్నాయి.విశ్లేషణ సినిమాకి ఓ టోన్ అంటూ ఉండాలి.

దాన్నే genre అని అంటారు.ఇప్పుడు సాహసం శ్వాసగా సాగిపోని ఏ జానర్ లో వేయ్యాలో అర్థం కాని పరిస్థితి.

మొదటిభాగం అంతా పోయేటిక్ గా, హాయిగా, ఏఆర్ సంగీతం వింటూ, మనం కూడా ఆ రెండు ప్రేమపక్షులతో ఏదో ప్రయాణంలో ఉన్నట్లే అనిపిస్తుంది.సెకండాఫ్ రియలిస్టిక్ గా మొదలై, అలానే కొనసాగుతూ, మళ్ళీ క్లయిమాక్స్ కి వచ్చేసరికి, ఓస్ .దీన్ని ఓ ట్విస్ట్‌ లా దాచిపెట్టారా .ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు అని అనిపిస్తుంది.ఇక్కడ నిందించాల్సింది దర్శకుడినే.

ప్రేమకథ చిక్కుల్లో పడకూడదని కాదు, కాని కంప్లీట్ గా ఓ అందమైన కవిత చదువుతున్న మూడ్ ని సెట్ చేసి, ఒక్కసారిగా వేరే సినిమా చూపిస్తున్నట్లు రియలిస్టిక్ నరేషన్ లోకి వెళ్ళిపోతాడు.మొదటినుంచి ఒకేరకమైన నరేషన్ ఎంచుకుంటే బాగుండేది.

మొదటినుంచి వాస్తవికతకు దగ్గరగా తీసుంటే ఓ థ్రిల్లర్ చూసామన్నా ఫీలింగ్ కలిగేది.పోని, ఆ సెకండాఫ్ అయినా, కూర్చి అంచున కూర్చునేంత థ్రిల్లింగ్ గా అనిపించిందా అంటే లేదు.

అరిగిపోయిన ట్విస్ట్‌ తో క్లయిమాక్స్ లో మరో ప్రయోగం చేస్తాడు దర్శకుడు.కాని అప్పటికే హీరోహీరోయన్ పాత్రలు ఎలాంటి ప్రమాదంలో లేరని అర్థమయ్యిపోతుంది.

వారు క్షేమంగానే ఉన్నారని తెలిసాక ఆ థ్రిల్లింగ్ మూమెంట్ అప్పటికే తగ్గిపోయి, పాత్రలు ప్రమాదంలో పడటానికి ఎంచుకున్న కారణం ఎంత నాసిరకమో అర్థమయ్యాక దర్శకుడి మీద విపరీతమైన కోపం వస్తుంది.ఫస్టాఫ్ కోసం యవతరం లాగేస్తుందేమో .సెకండాఫ్ ఏ రకమైన ప్రేక్షకుల కోసం వడ్డించారో.హైలైట్స్ : * ఏ ఆర్ రెహమాన్ సంగీతం * ఫస్టాఫ్ * హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ డ్రాబ్యాక్స్ : * సెకండాఫ్ * రెండు సినిమాలు చూసిన ఫీల్, రెండు వేరువేరు టేకింగ్ పద్ధతులు * నాసిరకం ట్విస్ట్‌ * పాత్రలు ప్రమాదంలో పడటానికి ఎంచుకున్న కారణం చివరగా : ఫస్టాఫ్ కోసం తెలుగుస్టాప్ రేటింగ్ : 2.5/5.

తాజా వార్తలు