కుసుమ పంట( Safflower Crop ) ప్రధాన నూనె గింజల పంటలలో ఒకటి.కుసుమ మొక్కకు ముల్లులు అధికంగా ఉండడం, పైగా ఆదాయం తక్కువగా ఉండడం, కూలీల కొరత వల్ల సాగు విస్తీర్ణం తగ్గింది.
అయితే ఇటీవలే కాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగడం, ముల్లు లేని రకాలు అందుబాటులోకి రావడం వల్ల రైతులు కుసుమ పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కుసుమ మొక్కలు దాదాపుగా 30 నుండి 150 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి.
కుసుమ చెట్టు పూలు( Safflowers ) గుండ్రని ఆకారంలో కలిగి పసుపు, నారింజ, ఎరుపు రంగులలో ఉంటాయి.ఒక్కో పువ్వులో దాదాపుగా 20 వరకు గింజలు ఉంటాయి.
అయితే కాండం పెరిగే దశ నుండి పూర్తిగా ఎదిగి వరకు ఈ మొక్కలు మంచును తట్టుకొని నిలబడలేవు.
అధిక దిగుబడిని ఇచ్చే మేలురకం కుసుమ విత్తనాల( Safflowers Seeds ) విషయానికొస్తే.డి.యస్.హెచ్-185, ఎస్.ఎస్.ఎఫ్-708, పి.బి.ఎన్.ఎస్-12, టి.ఎస్.ఎఫ్-1, నారీ-6 .ఇందులో నారీ-6 రకం ముల్లులు లేనిది.ఈ రకం విత్తనాలను రబీలో ( Rabi ) సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చు.
ఈ కుసుమ పంట సాగుకు నీరు నిల్వ ఉండని బరువైన నేలలు, నీటి వసతి ఉండే ఎర్ర గరప నేలలు అనుకూలంగా ఉంటాయి.అంతే కాదు ఈ కుసుమను అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు.సాగు చేపట్టిన 135 రోజుల్లో పంట పక్వ దశకు చేరుకుంటుంది.
ఈ కుసుమ పంటకు ఆకుపచ్చ తెగుళ్లు, పెనుబంకా పురుగుల సమస్య చాలా ఎక్కువ.
ఈ రెండింటిని తొలి దశలోనే అరికడితే మంచి దిగుబడి మంచిది.ఇక నేల యొక్క తేమశాతాన్ని బట్టి పంటకు నీటి తడులు అందించాలి.
అధిక ప్రాధాన్యం సేంద్రియ ఎరువులకే ఇవ్వాలి.