ద‌గ్గు, జ‌లుబుకు చెక్ పెట్టే `స‌బ్జా`.. ఎలా వాడాలంటే??

ప్రస్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి.

ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.క‌రోనా మాత్రం వ‌దిలిపెట్ట‌డం లేదు.

అయితే ఈ క‌రోనా స‌మ‌యంలో జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయంటే ప్ర‌జ‌లు క‌రోనా వ‌చ్చిందేమో అని తెగ భ‌య‌ప‌డుతున్నారు.కానీ, ద‌గ్గు, జ‌లుబు వ‌చ్చినంత మాత్రానా.

క‌రోనా వ‌చ్చిన‌ట్టు కాదు.ఎందుకంటే.

Advertisement

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం.ఈ కాలంలో ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గానే ఉంటాయి.ఇక ఈ ద‌గ్గు, జ‌లుబు వ‌చ్చాయంటే.

ఓ ప‌ట్టాన పోవు.ఎన్ని మందులు వాడినా.

అనేక చిట్కాలు పాటించినా ఫ‌లితం ఉండ‌క‌పోవ‌చ్చు.

అయితే ద‌గ్గు, జ‌లుబుకు స‌బ్జా గింజ‌లతో సులువుగా చెక్ పెట్ట‌వ‌చ్చు.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే స‌బ్జా ద‌గ్గు, జ‌లుబును త‌గ్గించ‌డ‌మే కాదు.గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి వంటి స‌మ‌స్య‌లను కూడా త‌గ్గిస్తుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మేఘాలలో భయంకరమైన ఆకారాలు.. వీడియో చూస్తే వణుకు పుడుతుంది!

మ‌రి స‌బ్జాను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.గోరు వెచ్చ‌ని నీటితో కొద్దిగా తేనె, అల్లం ర‌సం క‌లిపి దాంతో పాటు కొన్ని స‌బ్జాగింజ‌ల‌ను కూడా అందులో వేసి బాగా క‌లిపాలి.

Advertisement

అనంతరం ఈ మిశ్ర‌మం తాగడం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు న‌య‌మ‌వ‌డంతో పాటు జ్వరం కూడా త‌గ్గుతుంది.అలాగే త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న వారు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ స‌బ్జా గింజ‌లు వేసి.

పావు గంట త‌ర్వాత తాగితే త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.మ‌రియు అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్ వంటి వ్యాధులకు కూడా ఈ స‌బ్జా గింజ‌ల నీరు మంచి మందుగా చెప్పొచ్చు.

తాజా వార్తలు