పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమ్లా నాయక్. నిన్న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఎన్నో రోజుల పవర్ స్టార్ అభిమానుల కల ఈ సినిమా చూడాలని.మాస్ అవతార్ లో పవన్ ను చూడాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి భీమ్లా నాయక్ తో పవర్ ప్యాక్డ్ ట్రీట్ ఇచ్చాడు.
దీంతో ఈ సినిమా కోసం థియేటర్ ల వద్ద ఫ్యాన్స్ పూనకాలు స్టార్ట్ అయ్యాయి.
మునుపెన్నడూ లేని విధంగా పవన్ మాసీవ్ పాత్రలో నటించడంతో థియేటర్ ల దగ్గర రచ్చ మొదలయ్యింది.
ఫ్యాన్స్ చేస్తున్న పూనకాలతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న థియేటర్స్ అన్ని కూడా దద్దరిల్లి పోతున్నాయి.భీమ్లా నాయక్ అంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ రోజు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.
ఈ సినిమాపై ముందు నుండి సాగర్ చంద్రకు ఛాన్స్ ఇవ్వకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ నే అంతా తన చేతిలోకి తీసుకున్నాడని రూమర్స్ వచ్చాయి.
ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఇలాంటి వార్తలే వినిపించాయి.అయితే తాజాగా జరిగిన ఈ ప్రెస్ మీట్ లో సాగర్ త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ.ముందుగా చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఆ తర్వాత త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ.సినిమాకు బ్యాక్ బోన్ త్రివిక్రమ్.
సెట్ లో అంతమందిని కో ఆర్డినేట్ చేయడానికి, స్పిరిట్ ఇవ్వడానికి ఒక పర్సన్ కావాలి.అంటే హారానికి దారం లాంటివారు త్రివిక్రమ్ అని ఒక్క మాటలో ఆయన గురించి చెబుతూ పొగడ్తలతో ముంచెత్తారు.