ఆరెక్స్ 100( Rx 100 ) సినిమాతో హిట్ అందుకున్న కార్తికేయ( Karthikeya ) ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ ఆ సినిమా ఇచ్చినంత హిట్ దక్కించుకోలేకపోతున్నాడు.ఒకటి రెండు సినిమాల్లో విలన్ గా కూడా చేసిన కార్తికేయ లేటెస్ట్ గా బెదురులంక 2012 సినిమాతో వస్తున్నాడు.
వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ట్రైలర్ బుధవారం రాం చరణ్ రిలీజ్ చేశారు.అయితే ఈ ట్రైలర్ రిలీజ్ సెంటిమెంట్ చూస్తే ఈ సినిమా పక్కా హిట్ అనేలా ఉంది.
అదెలా అంటే కార్తికేయ ఆరెక్స్ 100 సినిమా ట్రైలర్ కూడా చరణ్ చేతుల మీదుగానే రిలీజ్ చేశారు.

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇప్పుడు అదే సెంటిమెంట్ తో బెదురులంక 2012( Bedurulanka 2012 ) సినిమా ట్రైలర్ కూడా చరణ్ తో రిలీజ్ చేయించారు.ఈ సినిమా ఆగష్టు 25న రిలీజ్ అవుతుంది.
సినిమా హిట్ పడితే మాత్రం కచ్చితంగా చరణ్ తోనే కార్తికేయ ప్రతి సినిమా ట్రైలర్ రిలీజ్ చేయించుకుంటాడు.క్లాక్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా శెట్టి( Neha Shetty ) హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.







