రష్యా( Russia ) ఓడిపోవాలని తెగ దండాలు పెడుతున్నాయి నాటో దేశాలు.ఒక వేళ ఓడిపోయే పరిస్థితి వస్తే ముందు బ్రిటన్ పైనే దాడి చేసేందుకు సన్నద్ధమౌతుందని బ్రిటన్ సైన్యానికి చెందిన ఓ అధికారి అన్నారు.అవును, టెలిగ్రామ్ చానల్ తో బ్రిటన్ సైనికాధికారి తాజాగా మాట్లాడుతూ.“రష్యాకి ఓడిపోయే పరిస్థితి వస్తే.దానికి కారణమవుతున్న అమెరికా, యూరప్( America, Europe ) దేశాలను చూస్తూ ఉపేక్షించదు.ముందుగా యూరప్ దేశాలను టార్గెట్ చేసి అణు విధ్వంసం చేయడానికి కూడా రష్యా ఇపుడు వెనుకాడదు.” అని వెల్లడించారు.

ఈ క్రమంలో అమెరికా మొదట ఎక్కువ చేసినా, క్రమంగా నిమ్మకుంది.కాబట్టి దానికి వెంటనే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.కానీ రష్యా కు దగ్గరగా ఉన్న నాటో దేశాల పరిస్థితే ఇపుడు అర్ధం కావట్లేదు.
అణు విధ్వంసం విషయం ఇపుడు ఎందుకంటే… పుతిన్ ఆమధ్య కొంచెం గట్టిగానే నాటో దేశాలను ఈ విషయంలో హెచ్చరించి వున్నాడు.ఈ క్రమంలోనే బ్రిటన్ పేరు బాగా వినబడుతోంది.
ఉక్రెయిన్( Ukraine ) కు ఎక్కువగా ఆయుధాలను సరఫరా చేసింది బ్రిటన్ దేశమే.అలాంటపుడు పుతిన్ ఎందుకు బ్రిటన్ ను టార్గెట్ చేయడని నిపుణులు అనుకుంటున్నారు.

అందుకే అలాంటి పరిస్థితులు గనుక వస్తే, నాటో దేశాలపై అణు బాంబులు వేయకుండా పుతిన్ ( Putin )నిద్రపోడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.ఇకపోతే ఉక్రెయిన్ పై రష్యా ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తూ ఉంది.ఒక వేళ రష్యా వెనకడుగు వేసే సమయం వస్తే మాత్రం ప్రపంచంలోనే అందరి కంటే ఎక్కువగా అణ్వయుధాలు వారి వద్దనే ఉన్నాయని అందరికీ విదితమే.ఏ మాత్రం ఆలోచించకుండా నాటో దేశాలపై ముందు అది ఎటాకింగ్ చేస్తుంది.
యుద్దం ప్రారంభమై 16 నెలలు కావొస్తుంది.ఇప్పటికే 2 దేశాల సైనికులు లక్షల్లో మరణించారు.
నాటో దేశాలు, అమెరికా కలిసి ఆయుధాలు ఉక్రెయిన్ కు ఇస్తూనే ఉన్నాయి.ఇలాంటి సమయంలో రష్యా తీరును కచ్చితంగా గమనిస్తూ ఉండాలనుకుంటున్నారు.







