స్కూల్, సినిమా ధియేటర్ లపై రష్యా దాడులు..!!

రష్యా బలగాలు చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ లో సామాన్య ప్రజలు విలవిల లాడిపోతున్నారు.ఉక్రెయిన్ తూర్పు భాగంలో మెరేఫా పట్టణంలో పాఠశాలలను మరియు సినిమా ధియేటర్ లను టార్గెట్ చేసి రష్యా బలగాలు దాడులు చేసినట్లు ఉక్రెయిన్ న్యాయాధికారి స్పష్టం చేశారు.

 Russia Attacks School And Movie Theaters In Ukraine Details, Russia, Ukraine, U-TeluguStop.com

ఈ దాడులలో 21 మంది మరణించారు. మరికొంతమంది దాదాపు 30 మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా క్షతగాత్రులలో దాదాపు 10 మంది పరిస్థితి ప్రాణాపాయం ఉందని స్పష్టం చేశారు.

కాగా మొన్నటిదాకా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని టార్గెట్ చేసుకుని రష్యా బలగాలు దాడులు చేయగా ఇప్పుడు రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్ నీ టార్గెట్ చేసుకుని రష్యా బలగాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి.

ఈ క్రమంలో సామాన్యులపై రష్యా బలగాలు బాంబులతో దాడులకు పాల్పడటం తో… జనాలు భయం గుప్పిట్లో ఉన్నారు.ఎప్పుడు ఎక్కడ బాంబు పడుతుందో ప్రాణాలు పోతాయేమో…ఉక్రెయిన్ వాసులు రష్యా దాడులకు బెంబేలెత్తిపోతున్నారు.మరోపక్క… జరుగుతున్న యుద్ధానికి సంబంధించి శుక్రవారం.అమెరికా, చైనా అధ్యక్షులు భేటీ కానున్నట్లు.

యుద్ధం చివరి దశకు చేరుకున్నట్లు.వార్తలు అంతర్జాతీయ మీడియాలో వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube