మరో వారం రోజుల్లో క్రిస్మస్ పండుగ రాబోతుంది.మరి పండుగ సీజన్ అంటే సినీ ఇండస్ట్రీకి పండుగ అనే చెప్పాలి.
ఎందుకంటే పండుగకు సినిమాలు రిలీజ్ చేస్తే కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మోత మోగిపోతుంది.మరి ఈ ఏడాది కూడా క్రిస్మస్ కానుకగా వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి.
అయితే సడన్ గా క్రిస్మస్ బరిలో ప్రభాస్ ‘సలార్’ రావడంతో చాలా సినిమాలు వాయిదా పడకతప్పలేదు.మరి ప్రభాస్ తన సినిమాతో వస్తున్నాడు అని తెలిసి కూడా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి.
ఇలా మొత్తంగా ఈ ఈసారి క్రిస్మస్ కానుకగా మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి.మరి ఆ మూడు సినిమాలు ఏంటి? వాటి రన్ టైం ఎంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ ”సలార్” (Salaar).సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమా మిగిలిన రెండు సినిమాల కంటే భారీ రన్ టైం తో రాబోతుంది.ఈ సినిమా మొత్తంగా 2 గంటల 55 నిముషాలు అంటే 175 నిముషాల నిడివితో రాబోతుంది.
ఇక క్రిస్మస్ పండుగకు రాబోతున్న మరో సినిమా షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) తాజాగా నటించిన మూవీ ”డంకీ”.( Dunki Movie ).ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.మరి ఈ సినిమా 2 గంటల 41 నిముషాలు అంటే 161 నిముషాల నిడివితో రాబోతుంది.

వీటితో పాటు మరో సినిమా కూడా రిలీజ్ కానుంది.ఇది కూడా షారుఖ్ కు పోటీగా అదే రోజు రిలీజ్ కానుంది.డిసెంబర్ 21న హాలీవుడ్ భారీ యాక్షన్ మూవీ ”ఆక్వామ్యాన్” రిలీజ్ కానుంది.2 గంటల 4 నిముషాలు అంటే 124 నిముషాల నిడివితో రాబోతుంది.మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా క్రిస్మస్ విజేతగా నిలుస్తుందో చూడాలి.







