తారక్ కొరటాల శివ కాంబో సినిమాకు సంబంధించి ప్రచారంలోకి వచ్చిన స్థాయిలో ఈ మధ్య కాలంలో మరే సినిమాకు సంబంధించి రూమర్లు ప్రచారంలోకి రాలేదు.అయితే ఆలస్యంగానైనా ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
అయితే ఈ సినిమా కథకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఈ సినిమా అఖండ, కాంతార జానర్ లో ఉండనుంది.
మైథలాజికల్ టచ్ తో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.తారక్ ఈ సినిమాలో ఊరమాస్ రోల్ లో కనిపించనున్నారని ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
మరోవైపు ఈ సినిమాలో తారక్ కు జోడీగా కియారా అద్వానీ నటించే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కోసం తారక్ తన లుక్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే.
తారక్ ఈ సినిమా కోసం ఏకంగా 9 కిలోల బరువు తగ్గారు. జనతా గ్యారేజ్ సినిమా ఇదే కాంబినేషన్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధించింది.
తారక్ గత కొన్ని నెలలుగా షూటింగ్ లకు దూరంగా ఉండగా త్వరలో తారక్ కొరటాల శివ మూవీ షూటింగ్ మొదలుకానుంది.

తారక్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని సమాచారం అందుతోంది.కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు ఒక నిర్మాత కావడంతో తారక్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ సినిమాలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించేలా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.







