తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం.
తమన్నా ని ముద్దుగా అభిమానులు మిల్క్ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు.సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు పూర్తి అవుతున్న కూడా ఇప్పటికీ అదే అందాన్ని మైంటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ఈ మధ్యకాలంలో తమన్నా పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది.పెళ్లి, ప్రేమ, డేటింగ్ విషయంలో తమన్నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా తమన్నా గోవాలో సందడి చేస్తూ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మకు ముద్దుల వర్షం కురిపించడంతో సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అయ్యాయి.

ఇక అప్పటినుంచి తమన్నా విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎన్నో రకాలుగా ఆమె పై ట్రోలింగ్స్ చేయడంతో పాటుగా ఎన్నో రకాల వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.అయితే ఇప్పటివరకు తమన్నా ఆ వార్తల స్పందించలేదు.
దీంతో ఆ వార్తలు నిజమే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.దానికి తోడు ఇద్దరు కలిసి మరొకసారి ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయ్యింది.
ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా మరొకసారి తన ప్రియుడితో కలిసి కెమెరాకు చిక్కింది.విజయ వర్మతో కలిసి ముంబైలో జరిగిన ఒక వేడుకల్లో మెరిసింది మిల్క్ బ్యూటీ.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీంతో మరోసారి తమన్నా డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.దాంతో అభిమానులతో పాటు నెటిజన్స్ కి కూడా ఈ జంట నిజంగానే డేటింగ్ లో ఉందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వార్తలపై తమన్న ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.కాగా తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమన్నా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది.
టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.







