చంద్రబాబు తల్లికి వందనం స్కీమ్ అమలు వాళ్లకే.. ఆ నిబంధనలలో క్లారిటీ ఇదే!

చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం స్కీమ్( talliki vandanam scheme ) ను అమలు చేయనున్న సంగతి తెలిసిందే.

తల్లికి వందనం స్కీమ్ కు సంబంధించి చంద్రబాబు విధివిధానాలను వెల్లడించడం గమనార్హం.

ఈ స్కీమ్ ద్వారా 15,000 రూపాయలా ఆర్థిక సహాయం అందనుందని సమాచారం అందుతోంది.ఈ స్కీమ్ లబ్ధిదారుల గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ తో పాటు ఇతర గుర్తింపు కార్డ్ లను సైతం తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల కోసం ఈ స్కీమ్ అమలు కానుంది.దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన స్కూల్స్ కు పిల్లల్ని పంపించే తల్లులు ఏడాదికి 15,000 రూపాయలు ఈ స్కీమ్ ద్వారా పొందనున్నారు.

రేషన్ కార్డ్ ( Ration card )కలిగి ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.

Advertisement

విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని భోగట్టా.తెలుస్తున్న నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చేలా ఈ స్కీమ్ అమలు కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.తల్లికి వందనం స్కీమ్ అమలు ద్వారా విద్యార్థుల తల్లీదండ్రులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తల్లికి వందనం స్కీమ్ వల్ల విద్యార్థుల తల్లీదండ్రులపై పిల్లల చదువు విషయంలో ఆర్థిక భారం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.తల్లికి వందనం స్కీమ్ అమలు దిశగా టీడీపీ వేగంగా అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తిస్థాయి ప్రయోజనాలను పొందనున్నారని సమాచారం అందుతోంది.

చంద్రబాబు తల్లికి వందనం స్కీమ్ అమలుపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అతని ఎవరు బయటకు గెంట లేదు... క్లారిటీ ఇచ్చిన నాగ మణికంఠ చెల్లెలు!
Advertisement

తాజా వార్తలు