కుక్కను పర్వతంపైకి మోసినందుకు రూ.11 వేలు.. దీని రాజభోగాలు తెలిస్తే!

చైనా( China )కు చెందిన ఒక మహిళ తన డాగ్స్‌ను తనతో పాటే అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్తోంది.

ఇటీవల ట్రెక్కింగ్ సాహస యాత్రలో భాగంగా ఆమె తన కుక్కలతో కలిసి అద్భుతమైన సౌందర్యాలతో కూడిన పవిత్ర ప్రదేశమైన సాన్‌కింగ్( Mount Sanqing ) పర్వతానికి వెళ్ళింది.

అయితే, ఆమె కుక్కలలో ఒకటి పర్వతం పైకి ఎక్కేందుకు కష్టపడింది, అది 40 కిలోమీటర్ల పొడవైన కాలిబాటలో నడవడానికి నిరాకరించింది.తన పెంపుడు జంతువును కిందే వదిలేయాలని యజమాని అనుకోలేదు.

ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆ లేడీ ఓనర్ కొద్దిసేపు ఆలోచించింది.చివరికి ఒక ఐడియా ఆమెకు తట్టింది.

ఆమె తన కుక్కను పర్వతం పైకి తీసుకెళ్లడానికి ఇద్దరు పురుషులను నియమించుకుంది.

Advertisement

ఈ సర్వీస్ కోసం మహిళ 980 యువాన్ ధరను చెల్లించింది.ఇది దాదాపు రూ.11,000 సమానం.ఆమె తన కుక్క రైడ్‌ను ఆస్వాదిస్తున్న వీడియోను రికార్డ్ చేసింది.

దానిని ప్రముఖ చైనీస్ సోషల్ మీడియా( Social media ) ప్లాట్‌ఫామ్ అయిన డౌయిన్‌లో షేర్ చేసింది.ఈ వీడియో వైరల్‌గా మారింది.చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది, వారు తన కుక్క పట్ల ఆ మహిళకు ఉన్న ప్రేమను చూసి ఆనందించారు.

జంతువులపై మనుషులు ఎక్కే ప్రయాణించడం చూసాం కానీ మనుషులపై జంతువులు ఎక్కి చూడటం ఇదే తొలిసారి అని మరి కొందరు కామెంట్లు పెట్టారు ఆ కుక్క రాజ భోగాలు మామూలుగా లేవని ఇంకొందరు వ్యాఖ్యానించారు.

ఈ కుక్క యజమాని హైర్‌ చేసుకున్న చైర్ సర్వీస్ వాస్తవానికి పర్వతాన్ని ఎక్కడానికి సహాయం అవసరమైన హ్యూమన్ విజిటర్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది.సాన్‌క్వింగ్ మౌంటైన్ టూర్ కంపెనీ ప్రతినిధి ప్రకారం, కుక్కలు సాధారణంగా వాటి యజమానులు తమ మంచి ప్రవర్తనకు హామీ ఇస్తే తప్ప ఈ సర్వీస్ అందించడానికి ఎవరూ ముందుకు రారు ఎందుకంటే కుక్కలు బ్యాడ్ గా ప్రవర్తించి కరి చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది.అయితే ఆ లేడీ ఓనర్ చెప్పిన ప్రకారం కుక్క బుద్ధిగా కుర్చీలో కూర్చొని ప్రయాణించింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు