టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.గత ఏడాది విడుదలైన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించడం తో పాటు ఆస్కార్ అవార్డులను కూడా అందుకున్న విషయం తెలిసిందే.
కనెక్షన్ల పరంగా అయితే ప్రపంచ వ్యాప్తంగా సునామీని సృష్టించింది.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చర్చిస్తూ ఉండగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై స్పందించాడు విజయేంద్ర ప్రసాద్.

ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు దక్కడం తనకు ఎంతో హ్యాపీగా ఉందని, రాజమౌళికి ఫాదర్ అయినందుకు, ఆయన తనకు కుమారుడు అయినందుకు ఓ తండ్రిగా గర్వపడుతున్నానని, అత్యంత సంతోషకరమైన సందర్భం అని తెలిపారు విజయేంద్రప్రసాద్.తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ లోని నాటు నాటు పాటకి(Naatu Naatu) ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే.దీంతో ఇండియన్ సినిమా చరిత్ర సృష్టించింది.తెలుగు సినిమా ప్రపంచానికి తెలిసేలా చేసింది నాటు నాటు.ఈ సినిమాకి పునాది వేశారు విజయేంద్రప్రసాద్.ఇలా ఉంటే తాజాగా ఒక మీడియాతో ముచ్చటించిన విజయేంద్ర ప్రసాద్(Vijayendra prasad) ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆస్కార్ తనపై బాధ్యత పెంచిందన్నారు.ఇక పై తాను మరిన్ని మంచి కథలు రాసేందుకు ప్రోత్సాన్నిచ్చింది అని తెలిపారు.అనంతరం ఈ సినిమా సీక్వెల్ పై స్పందిస్తూ.ఆర్‌ఆర్‌ఆర్2 ఉంటుందని తెలిపారు.ఇదే కథకి కొనసాగింపుగా కథ ఉంటుందని ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తారని వెల్లడించారు.ఇదే కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నామని, ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.







