వయోభారమో లేక కంగారు పడతారో తెలియదు కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తనకు తానుగా నవ్వుల పాలవుతున్నారు.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయనది ఇదే తంతు.
మొన్నామధ్య కమలా హారీస్‌ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు బైడెన్.అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం ఆయన చెప్పలేక తడబడ్డారు.
తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన.రష్యా – ఉక్రెయిన్(Russia – Ukraine) సమస్య గురించి ప్రస్తావించారు.ఈ క్రమంలో ఉక్రెయిన్ అనాల్సిందిపోయి ఇరాన్ అంటూ వ్యాఖ్యానించి పరువు పొగొట్టుకున్నారు.ఇలా ఒకటి కాదు రెండు కాదు.బైడెన్ అభాసుపాలైన సందర్భాలు కోకొల్లలు.

తాజాగా పెద్దాయన మరోసారి నెటిజన్లకు, విపక్షాలకు దొరికిపోయారు.ప్రెస్‌మీట్ మధ్యలో నుంచి వెళ్లిపోయి, డోర్స్ క్లోజ్ చేసుకున్నారు.దీనిపై పాత్రికేయ లోకం, విపక్షాలు భగ్గుమంటున్నాయి.
వివరాల్లోకి వెళితే.ప్రస్తుతం అమెరికాలోని రెండు పెద్ద బ్యాంకులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా అసలే దేశ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సమయంలో బ్యాంకుల్లో సంక్షోభం అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది.ఈ క్రమంలో బైడెన్ మీడియా ముందుకు వచ్చారు.

బ్యాంకు సంక్షోభం(Bank crisis), వినియోగదారుల రక్షణ, ఆర్ధిక వ్యవస్థకు ఏం చేయబోతున్నారంటూ విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు.వీటికి ఉక్కిరిబిక్కిరైన బైడెన్ తడబడ్డారు.వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేదిక దిగి బయటకు నడవటం ప్రారంభించారు.కనీసం వెనక్కి కూడా తిరగకుండా సమావేశ మందిరం తలుపులు మూసి బయటకు వెళ్లిపోయారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీనిపై విపక్ష రిపబ్లికన్ పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
అంతకుముందు కొద్దిరోజుల క్రితం కూడా చైనాలోని కుటుంబ వ్యాపారాలకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు బైడెన్ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి షాకిచ్చారు.తాజాగా మరోసారి అమెరికా అధ్యక్షుడు అలాంటి వైఖరి అవలంభించడం చర్చనీయాంశమైంది.







