#StandTogether కరోనాపై అవగాహన RRR టీం స్పెషల్ వీడియో..!

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవం అందరికి తెలిసిందే.రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి.

 #standtogether కరోనాపై అవగాహన Rrr టీం స్ప�-TeluguStop.com

వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది ఇక కరోనా వ్యాక్సినేషన్ పై ప్రజల్లో అవగాహన కలిగించేలా ఆర్.ఆర్.ఆర్ టీం స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.ఈ స్పెషల్ వీడియోలో ఎన్.

టి.ఆర్, రాం చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ తో పాటుగా రాజమౌళి కూడా పాల్గొన్నారు.కరోనాని జయించాలంటే ఇంటి వద్దనే ఉండాలని మాస్క్, శానిటైజర్ ఉండాలని తమతో పాటు ఫ్యామిలీ, స్నేహితులను కాపాడాలని అన్నారు.

ఈ స్పెషల్ వీడియోలో అలియా భట్ తెలుగులో మళయాళంలో రాజమౌళి కన్నడలో ఎన్.టి.ఆర్, తమిళంలో చరణ్.హిందీలో అజయ్ దేవగన్ ప్రచారం చేశారు.ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుండగా ఒక్కో భాషలో ఒక్కొక్కరు కరోనా వ్యాక్సినేషన్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు.

కరోనా వ్యాక్సినేషన్ పై అవగాహన కలిగేలా ఆర్.ఆర్.ఆర్ టీం చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆర్.ఆర్.ఆర్ టీం మొత్తం కలిసి స్టాండ్ టుగెదర్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఈ ప్రచారం చేస్తున్నారు. కరోనా పై పోరాడేందుకు అంతా ఒక్కటవ్వాలని తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనాని నియంత్రించాలని ఆర్.ఆర్.ఆర్ టీం చెబుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube