‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పుకార్లకు అంతూపోంతు లేకుండా పోతుంది

టాలీవుడ్‌

జక్కన్న రాజమౌళి

తెరకెక్కిస్తున్న భారీ చిత్రం

ఆర్‌ఆర్‌ఆర్‌

.ఈ చిత్రం షూటింగ్‌ కరోనా వల్ల ఆగిపోయింది.

ఇప్పటికే ఈ సినిమా 80 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది అంటూ జక్కన్న గతంలోనే ప్రకటించాడు.అయినా కూడా ఈ సినిమాలో ఆ హీరో నటించబోతున్నాడు, ఈ స్టార్‌ నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇటీవలే మలయాళ సూపర్‌ స్టార్‌

మోహన్‌లాల్‌

ను ఈ చిత్రంలో నటింపజేసేందుకు

జక్కన్న

ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

తమిళ సూపర్‌ స్టార్‌

విజయ్‌ను ఈ చిత్రంలో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.తమిళంలో ఈ సినిమాకు భారీ క్రేజ్‌ను తీసుకు వచ్చేందుకు ఈ ప్రయత్నాలు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా కోసం

విజయ్‌

తో రాజమౌళి చర్చలు జరుపుతున్నాడు అంటూ

సోషల్‌ మీడియా

లో ప్రచారం జరుగుతోంది.

ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.జక్కన్న సినిమా విషయంలో ముందస్తుగా పక్కా ప్లానింగ్‌తోనే ఉంటాడు.మద్యలో నటీనటులను తీసుకోవడం, తీసేయడం వంటివి చేయడు.

కనుక ఇప్పుడు విజయ్‌ను తీసుకోబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని అంటున్నారు.అసలు జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఏ స్టార్‌ను కొత్తగా సంప్రదించలేదు అంటూ మరికొందరు యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

వారెవ్వరు నటించకున్నా కూడా జక్కన్న సినిమా అంటే విపరీతమైన క్రేజ్‌ ఉంటుందని ఆయన అభిమానులు అంటున్నారు.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు