ఐపీఎల్ 2023 మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి.ఆఖరి నిమిషంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ప్రేక్షకులను టెన్షన్ పెడుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తాజాగా కూడా మ్యాచ్ గోవిందా అనుకున్నారు.కానీ ఆఖరి నిమిషంలో సన్ రైజర్స్( Sunrisers ) విజృంభించింది.
మ్యాచ్ చివర్ లో వరుసగా సిక్సులు, ఫోర్లు కొట్టి విజయం సాధించింది.అయితే సన్రైజర్స్ విజయాన్ని రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals )జీర్ణించుకోలేకపోయింది.
రెచ్చిపోయి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది.ఫలితంగా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది.
తమ కెప్టెన్ సంజూ శాంసన్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కంటే గ్రేట్( RRR ) అన్నట్లుగా ఒక పోస్ట్ పెట్టింది.అయితే ఇందులో ఎవరి కెప్టెన్‌పై వారు పొగడ్తల వర్షం కురిపించుకోవడం బాగానే ఉంది.కానీ మధ్యలో ఆర్ఆర్ఆర్ సినిమా ఏం చేసిందని? ఇదే ఎవరికీ అర్థం కాలేదు.బహుశా తెలుగు సినిమా కావడంతో సన్‌రైజర్స్‌కు బదులుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను వాడి ఉండవచ్చు.
ఏదేమైనా మధ్యలోకి ఆర్‌ఆర్‌ఆర్ తీసుకురావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.దేశానికి ఆస్కార్‌ను తీసుకొచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ను అవమానిస్తున్నారా? అని రాజస్థాన్ రాయల్స్ పై ఒక రేంజ్‌లో రిచుకుపడ్డారు.
కాగా వారిని తక్కువ చేసి మాట్లాడితే ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ఊరుకుంటుందా? ఆ ట్వీట్‌కు రిప్లైగా వెంకీ సినిమాలో రవితేజను బ్రహ్మానందం కొట్టే వీడియోను పోస్ట్ చేసింది.అటు ఆర్‌ఆర్‌ఆర్ నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్( DVV Entertainment ) కూడా దీనికి ఘాటుగానే రిప్లై ఇచ్చింది.ఇడియట్ సినిమాలోని తొక్క తీస్తా, పెట్టురా సంతకం.ఫ్యాన్స్.బిల్డప్ పెట్టు త్వరగా అంటూ థర్టీ ఇయర్స్ పృథ్వీ శ్రీనివాసరెడ్డిని లాగి ఒక్కటిచ్చే వీడియోను షేర్ చేసింది.ఈ విపరీతమైన ట్రోలింగ్‌తో తప్పు తెలుసుకున్న రాజస్థాన్ రాయల్స్ తర్వాత క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వాటిని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.