ఆ దేశాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుందా.. ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ అంటూ?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన వాళ్లకు ఊహించని స్థాయిలో లాభాలను అందించింది.ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కాగా దాదాపుగా 1130 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా సాధించింది.

 Rrr Movie Release In 30 Countries Details, Rrr Movie 30 Countries, Director Raja-TeluguStop.com

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే అతి త్వరలో ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.ఆర్ఆర్ఆర్ మూవీ 30 దేశాల్లో త్వరలో రిలీజ్ కానుందని బోగట్టా.

ఇతర దేశాల ప్రేక్షకులు ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఓటీటీలో ఈ సినిమాను చూస్తున్నారు.అయితే తమ సొంత భాషలో ఈ సినిమాను చూసే అవకాశాన్ని ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఇతర దేశాల ప్రేక్షకులకు కల్పించనున్నారు.

అతి త్వరలోనే ఈ సినిమా ఇతర దేశాల్లో రిలీజ్ కానుందని వైరల్ అవుతున్న వార్తలు అభిమానులకు సంతోషాన్ని కలుగజేస్తున్నాయి.

Telugu Block Buster, Rajamouli, Ntr, Pan, Ram Charan, Rrr, Tollywood-Movie

ఇతర దేశాల్లో ఆర్ఆర్ఆర్ విడుదలైతే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.దర్శకునిగా రాజమౌళి రేంజ్ ను పెంచిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు.ఈ సినిమా ద్వారా చరణ్, తారక్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది.

Telugu Block Buster, Rajamouli, Ntr, Pan, Ram Charan, Rrr, Tollywood-Movie

ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు, విదేశీ ప్రేక్షకులు సైతం ఎన్టీఆర్, చరణ్ నటనను ప్రశంసిస్తున్నారు.చరణ్, ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను అందుకుని తమ రేంజ్ ను పెంచుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటుకున్నారు.చరణ్, ఎన్టీఆర్ తర్వాత సినిమాలు కూడా ఆర్ఆర్ఆర్ రేంజ్ హిట్లుగా నిలుస్తాయో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube