టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‘.ఈ సినిమా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
టాలీవుడ్ స్టార్ హీరోస్ అయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్, విదేశీ భామ ఒలీవియా మోరిస్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నారు.
విడుదల తేదీ దగ్గర అవుతుండడంతో సినిమా ప్రొమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్.
ఈ సినిమా నుండి వరుస అప్డేట్ లు విడుదల చేస్తూ ఎప్పుడు ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు.రాజమౌళి ఎవ్వరి అంచనాలకు అందకుండా ప్రమోషన్స్ ను కొత్తగా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా నుండి ఈ మధ్యనే విడుదల అయినా నాటు నాటు సాంగ్ అయితే యూట్యూబ్ బద్దలు అవుతుంది.
నాటు నాటు అనే సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ తమదైన శైలిలో డాన్స్ చేసి అదరగొట్టారు.వీరిద్దరూ కలిసి చేసిన హుక్ స్టెప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా కొత్త ట్రెండ్ కూడా సృష్టిస్తుంది.ఇక ఈ పాట కొరియోగ్రఫీ అందరిని ఆకట్టుకోవడంతో ఈ పాటకు ఎవరు కొరియోగ్రఫీ చేసారా అని ప్రేక్షకులంతా ఆరా తీయడం మొదలు పెట్టారు.
నాటు నాటు పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసారు.దీంతో ఇప్పుడు ఈయన పేరు మారుమోగి పోతుంది.
ఇక ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ తాజాగా ఒక వీడియో ను పోస్ట్ చేసాడు.ఆ వీడియోలో ఈ హుక్ స్టెప్ ప్ర్రతి ఒక్కరు ఎలా ఈజీగా చేయవచ్చో వివరిస్తూ వీడియోను షేర్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ పాటలో ట్రెండ్ అవుతున్న ఈ హుక్ స్టెప్ ఎలా కంపోస్ చేసారో ఈ వీడియోలో కనిపిస్తుంది.మీరు కూడా ఈ వీడియో చూసి ఈ స్టెప్ ను ఈజీగా నేర్చేసుకోండి.