ఇంటిని కూల్‌గా మార్చేసే రూఫింగ్ మెటీరియల్.. ఏసీలు అవ‌స‌ర‌మే లేదంట‌..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కాలంలోనైనా ఫ్యాన్, ఏసీలు మస్ట్ అయిపోయాయి.ఎండాకాలంలో అయితే ఇంకా కంపల్సరీ.

కాగా, వీటి హెవీ యూసేజ్ వల్ల కరెంటు బిల్లులు మోత మోగడం మనం గమనించొచ్చు.ఈ నేపథ్యంలో ఇంటిని అతి తక్కువ ధరలో చల్లగా ఉంచుకునేందుకు గాను ఓ వినూత్న ఆలోచన చేశాడు ఈ సైంటిస్టు.

ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ కూలింగ్ పేపర్.ఇది ఉంటే చాలు.

ఇక మీరు ఫ్యాన్లు, ఏసీలకు గుడ్ బై చెప్పేయొచ్చట.కరెంట్ అవసరం లేకుండా ఇల్లు చల్లబడుతుంది.

Advertisement

అది ఎలాగంటే.సదరు శాస్త్రవేత్త కనిపెట్టిన కూలింగ్ పేపర్ మెటీరియల్ భానుడి కిరణాల నుంచి ఉత్పన్నమయ్యే వేడిని తీసుకుంటాడయి.

దాంతో పాటు హౌజ్ బిల్డింగ్స్‌ల్లో ఉండే హీట్‌ను కూడా గ్రహించుకుంటాయి.ఇక దాంతో మీ ఇల్లు ఆటోమేటిక్‌గా చల్లబడుతుంది.

ఈ కూలింగ్ పేపర్ మెటీరియల్.సూర్య కిరణాల నుంచి ఉత్పన్నమయ్యే వేడిని లాగేసుకుంటుంది.

ఇంటి భవనాల్లో ఉండే ఉష్ణోగ్రత స్థాయిలను పూర్తిగా సంగ్రహించుకుంటుంది.తద్వారా మీ ఇల్లంతా కూల్ అవుతుంది.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఇయర్‌రింగ్స్ తొడుక్కున్న ఫారిన్ వ్యక్తి.. తొలగించమన్న అవ్వ..?

ఈ మెటీరియల్‌ను రీసైకిల్ పేపర్ నుంచి తయారుచేశారు.దీనిని హౌజ్‌పై‌న అరేంజ్ చేసుకుంటే చాలు.

Advertisement

అది ఎల్లప్పుడూ హీట్ తీసుకుని ఇంటిని చల్లబరుస్తుంది.ఇక ఇది కనుక ఇంటిపైన పెట్టుకుంటే ఏసీతో పాటు కరెంటు కూడా అవసరమండదు అనడంలో అతిశయోక్తి లేదు.

దీనిని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఈజెంగ్ రూపొందించారు.

ఈ కూలింగ్ పేపర్ ఏసీల కంటే ఎక్కువగా పనిచేస్తుందని, లాంగ్ లాస్టింగ్ మెటీరియల్ అని ప్రొఫెసర్ తెలిపారు.ఈ వినూత్న ఆవిష్కరణ అందరినీ ఆకర్షిస్తుండగా, అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది.భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు మరిన్ని జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు