హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.ఏప్రిల్ నెలలో ఢిల్లీ టూర్ లో బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమా షూటింగ్ లకు పరిమితమయ్యారు.
ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావటం సంచలనంగా మారింది.
ఈ రీతిగా ఈ ఇద్దరు మూడోసారి భేటీ కావడం జరిగింది.అయితే ఈ భేటీ పై రకరకాల వార్తలు విశ్లేషణలు వస్తున్నాయి.ఈ క్రమంలో వైసీపీ మంత్రి రోజా.
వీరిద్దరి భేటీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ చంద్రబాబు భేటీ కొత్తేం కాదు.
మొదట్లో అయితే హాట్ టాపిక్.ఇప్పుడు కామన్.
జగన్ ను రాజకీయంగా తరిమేయాలన్న కుట్ర జరుగుతూనే ఉంది.బాబు, పవన్ పగటి కలలు కంటున్నారు.
వారిద్దరూ కలిసి వచ్చిన చర్చకు సిద్ధం.నగరి, కుప్పం లేదా పవన్ ఓడిపోయిన నియోజకవర్గలలో నైనా రెడీ.
మీరేం చేశారో, మేమేం చేశామో ప్రజలే చెబుతారు అని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.