విశ్లేషణ : రోజాకు మంత్రి పదవి కష్టమే

నవ్యాంద్ర ప్రదేశ్‌ రెండవ సీఎంగా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు.

నిన్న కేవలం జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

ఆయన కాకుండా కొందరు మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రచారం జరిగింది.కాని మంత్రి వర్గ కూర్చు ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

జిల్లాల లెక్కలు, కుల సమీకరణాలు, సామాజిక అంశాలు ఇలా పలు లెక్కలు వేస్తున్న జగన్‌ మోహన్‌ రెడ్డి తుది జాబితాను మరో రెండు మూడు రోజుల్లో సిద్దం చేసే అవకాశం ఉంది.ఎవరికి వచ్చినా రాకున్నా కూడా ఫైర్‌ బ్రాండ్‌ ఎమ్మెల్యే రోజాకు ఖచ్చింగా మంచి మంత్రి పదవి దక్కుతుందని ఆమె వర్గీయులు మరియు రాజకీయ ప్రముఖులు అంటున్నారు.

అయితే వైకాపా పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు మాత్రం రోజాకు కీలక మంత్రి పదవి కాదు కాదా కనీసం ఏదో ఒక మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు.ప్రస్తుతం రోజా చిత్తూరు నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెల్సిందే.

Advertisement

చిత్తూరు జిల్లాలోని వైకాపా నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, భూమ కరుణాకర్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది.ఈ ముగ్గురిలో ముగ్గురికి ఇస్తారా ఇద్దరికే ఇస్తారా అనేది చర్చనీయాంశంగా ఉంది.

ఇలాంటి సమయంలో అసలు రోజా గురించిన ప్రస్థావనే లేదు.చిత్తూరు జిల్లా నుండి ఖచ్చితంగా ఈ ముగ్గురిలో ఇద్దరు లేదా ముగ్గురికి పదవులు దక్కబోతున్న నేపథ్యంలో రోజాకు మంత్రి పదవి ఇవ్వడం కష్టం అవుతుంది.

ఒకే జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే ఇతర జిల్లాల పరిస్థితి ఏమవుతుంది.అందుకే రోజాకు ఈ సారికి మంత్రి పదవి లేనట్లే అంటూ ఆ పార్టీ నాయకులు కొందరు గుసగుసలాడుకోవడం జరుగుతుంది.

రోజాకు మంత్రి పదవి కాకున్నా మరేదైనా కీలక పదవి ఆమెకు దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే రోజా వర్గీయులు మాత్రం ఈ వాదన కొట్టి పారేస్తున్నారు.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు