వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ( MLA ROJA )మరోమారు టీడీపీపై, పవన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.చంద్రబాబు నాయుడు ఎవరినైనా చంపుతాడేమో కానీ చంద్రబాబును చంపేవాళ్లు ఎవరూ పుట్టలేదని రోజా అన్నారు.
రాష్ట్రం దేవుడిలా కొలిచే సీనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబు బురద జల్లారని రోజా కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించి కూడా రాజకీయాల్లో సక్సెస్ అయ్యారంటే చంద్రబాబుకు మీడియా ఏ విధంగా కొమ్ము కాసిందో అర్థమవుతుందని రోజా అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ గురించి పచ్చ పత్రికల్లో దారుణంగా కార్టూన్లు వచ్చాయని రోజా అన్నారు.ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ నిజమైన అభిమానులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.
చంద్రబాబు పొలిటికల్ గా ఎంతోమందిని పైకి పంపించారని ఎంతోమందిని జైలుకు పంపించారని రోజా వెల్లడించారు.రూల్స్ కు విరుద్ధంగా చంద్రబాబు ఎంతోమందిని హింసించాడని రోజా చెప్పుకొచ్చారు.

ఎంతోమంది క్యారెక్టర్ పై చంద్రబాబు నిందలు వేశారని అమె కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ, చంద్రబాబు 2009లో వాడుకున్నారని ఆమె చెప్పారు.ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి అని ఆమె అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం అంత రిస్క్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ నుంచి తరిమేయడంతో పాటు హరికృష్ణ( Hari Krishna )ను అవమానించారని రోజా చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) సినిమాలు కూడా ఆడనీయకుండా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు చేపట్టాడని రోజా కామెంట్లు చేశారు.ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడట్లేదని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని రోజా పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ లా టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ఎన్టీఆర్ చదవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని రోజా కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ అలా చేయడని ఆమె తెలిపారు.
రోజా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







